
గణపయ్యా.. విఘ్నాలు తీర్చయ్యా..
గణపతిని వివేకం, సంపదలకు దేవుడిగా ఆరాధిస్తారు. కోరినవన్నీ ఇచ్చేవాడు కాబట్టి వరసిద్ధి వినాయకుడు అనే పేరు పొందారు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి అవరోధాలు. వీటినే విఘ్నాలు అంటాం. అలాంటి ఆటంకాలను పోగొడతారు కనుకనే విఘ్నేశ్వరుడు అయ్యారు. అరిషడ్వర్గాలను అరికట్టి మోక్షసాధనకు మార్గం సుగమం చేసే వాడు లంబోదరుడు. అటువంటి గణనాథుని వేడుకలను జిల్లా వ్యాప్తంగా అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. వినాయక చవితి నాడు బుధవారం వాడవాడలా విగ్రహాలు ప్రతిష్టించారు. కొన్ని ఉత్సవ కమిటీల వారు మూడో రోజైన శుక్రవారం నిమజ్జనోత్సవం నిర్వహించారు. ఇంకా పలు ప్రాంతాల్లోని మండపాల వద్ద సందడి కొనసాగుతోంది. విభిన్న ఆకృతుల్లో కొలువు దీరిన గణనాథులను దర్శించుకునేందుకు నాలుగో రోజైన శనివారం కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ‘గణపయ్యా.. మమ్మల్ని దీవించయ్యా.. విఘ్నాలు తీర్చయ్యా’ అంటూ వేడుకున్నారు. అత్యధిక మంది ఆదివారం నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. –ప్రొద్దుటూరు కల్చరల్

గణపయ్యా.. విఘ్నాలు తీర్చయ్యా..