
ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు
– సమగ్రశిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీనివాస్
కడప ఎడ్యుకేషన్ : పాఠశాల విద్యలో పనిచేస్తున్న బోధనేతర సిబ్బంది శారీరక, మానసిక, ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు సమగ్రశిక్ష రాష్ట్ర పథక సంచాలకులు(ఎస్‌పిడి) శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా కడప మున్సిపల్ హైస్కూల్లో నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్డు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యాశాఖలో పనిచేసే బోధనేతర సిబ్బందికి ఈ నెల 20, 21 తేదీలలో ఏపీ పాఠశాల విద్యశాఖ రాష్ట్రస్థాయి లీప్ క్రికెట్ టోర్నమెంట్ పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. కడప జిల్లా విద్యాశాఖ బోధనేతర సిబ్బంది మర్యాద పూర్వకంగా ఆయను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కడప సూపర్ కింగ్స్ కెప్టెన్ మున్నా, వైఎస్ కెప్టెన్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
– ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ రమణ
ప్రొద్దుటూరు : జిల్లాలో సోలార్ రూఫ్‌టాప్ వలన గృహ వినియోగదారులు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని ఏపీఎస్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఎస్.రమణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని లక్ష్మీనగర్‌లోని వినియోగదారుల వద్దకు ఎస్‌ఈ రమణ వెళ్లి సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుపై వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీరో పెట్టుబడి వ్యయంతో సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్ల వలన కరెంట్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటు తర్వాత సబ్సిడీ ప్రయోజనం మొత్తం మీ బ్యాంక్ ఖాతాకు 30 రోజుల్లోపు జమ అవుతుందన్నారు. ఈ సబ్సిడీ మొత్తం సుమారు రూ.98వేలు ఉంటుందన్నారు. దీని ద్వారా కొంత ఆర్థిక స్థిరత్వం కలుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో విద్యుత్ వాహనాల ప్రాధాన్యత అధికంగా ఉంటుందని, వాటికి అవసరమైన విద్యుత్ శక్తి సోలార్ రూఫ్ టాప్ ద్వారా పొందవచ్చన్నారు. కార్యక్రమంలో ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రొద్దుటూరు డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రమణారెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ కృష్ణమోహన్, జూనియర్ ఇంజనీర్ సురేష్, సిబ్బంది పాల్గొన్నారు.
శ్రావణమాస ఉత్సవాలకు రూ.1.96 కోట్ల ఆదాయం
వేంపల్లె : ఈ ఏడాది గండి దేవస్థానం సంబంధించి శ్రావణమాస ఉత్సవాలకు అన్ని విభాగాల నుంచి రూ.1,96,07,865ల ఆదాయం వచ్చిందని ఆలయ సహాయ కమిషనర్ జె.వెంకటసుబ్బయ్య తెలిపారు. చక్రాయపేట మండలంలోని గండి వీరాంజనేయ స్వామి శ్రావణమాస మహోత్సవాలు ముగిసిన సందర్భంగా అధికారులు హుండీ, టికెట్ల, ఆదాయ, తదితర అన్ని విభాగాల లెక్కింపులు నిర్వహించారు. శుక్రవారం కడప దేవాదాయ శాఖ సి.శివయ్య పర్యవేక్షణలో పోలీసు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించగా నగదు రూపంలో రూ.40,71,120, బంగారు వస్తువులు 11గ్రాములు, వెండి వస్తువులు తొమ్మిది గ్రాములు, యూఏఈ అరబ్ 10 దిర్హమ్స్ ఆదాయం వచ్చింది. గత ఏడాది శ్రావణమాస మహోత్సవాలకు రూ.1.60,35,630 రాగా, ప్రస్తుతం ఈ ఏడాది రూ.1,96,07,865ల ఆదాయం వచ్చిందన్నారు. కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ కావలి కృష్ణ తేజ, మాజీ చైర్మన్ కల్లూరు వెంకటస్వామి, ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, ఆర్కే వ్యాలీ పోలీసులు, నారాయణ స్కూల్ ఉపాధ్యాయ సిబ్బంది, ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు

ఆరోగ్యం కోసమే క్రీడా పోటీలు