
అన్నమయ్య జిల్లా వద్దు.. బ్రహ్మంగారి జిల్లా ముద్దు
బ్రహ్మంగారి జిల్లా కావాలంటూ ప్రజాసంఘాల నిరసన
బద్వేలు నాలుగు రోడ్లు కూడలలో మానవహారం
జిల్లా సాధన సమితికి సంఘీభావం తెలిపిన విశ్వనాథరెడ్డి
బద్వేలు : రాజంపేటను జిల్లాగా చేసి అందులో బద్వేలు నియోజకవర్గాన్ని కలుపుతామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో అదే రోజు నుంచి బద్వేలు నియోజకవర్గంలో నిరసన జ్వాలలు రగులు కున్నాయి. ప్రతి రోజూ ఏదో ఒక సంఘం బద్వేలును కడప జిల్లాలోనే ఉంచాలని రాజంపేట వద్దని నిరసన రాగాలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా శుక్రవారం వీరబ్రహ్మేంద్రస్వామి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో బద్వేలును జిల్లా చేయాలని అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు.ఈ సందర్భంగా జరిగిన నిరసన కార్యక్రమానికి బద్వేలు పట్టణ ప్రజలే కాకుండా గ్రామాలని నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
ఉంటే వైఎస్‌ఆర్ కడప జిల్లా.. లేకుంటే బ్రహ్మంగారి పేరున జిల్లా
నాలుగు రోడ్ల కూడలిలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి వైఎస్‌ఆర్ సీపీ బద్వేలు నియోజకవర్గ అదనపు కార్యదర్శి నల్లేరు విశ్వనాధరెడ్డి తన సంఘీభావాన్ని తెలియజేశారు.ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కడప జిల్లాతో దశాబ్దాల కాలం నుంచి బద్వేలు నియోజక వర్గానికి విడదీయరాని బంధం ఉందని, దానిని కాదని నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజంపేట జిల్లాలో బద్వేలు నియోజక వర్గాన్ని కలుపుతామనడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలు కూటమి ప్రభుత్వం మాను కోవాలని హితవు పలికారు. ఒకవేళ తప్పదని బద్వేలును వైఎస్‌ఆర్ కడప జిల్లా నుంచి విడదీయాలని అనుకుంటే బ్రహ్మంగారి మఠం లో కొలువైన వీరబ్రంహ్మేస్వామి పేరుతో బద్వేలు నియోజక వర్గాన్ని జిల్లా కేంద్రం చేయాలన్నారు. అందుకు బద్వేలు పట్టణానికి అన్ని రకాల బౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా సాధన సమితి నాయులు, పెన్షనర్ల విభాగం మేధావులు, బీసీ సాధన సమితి, దళిత సాధన సమితి, విద్యార్థి విభాగం నాయకులు వివిద పార్టీల కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య జిల్లా వద్దు.. బ్రహ్మంగారి జిల్లా ముద్దు