
నాందేడ్–ధర్మవరం రైలు రద్దు
కడప అర్బన్ : ఆటో చోరీకి పాల్పడిన కడప నగరం ఎన్జీవో కాలనీ చెందిన తుమ్మలూరు అనిల్ కుమార్‌ను 24 గంటల్లోపే అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి లక్ష రూపాయల విలువైన ఆటో స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ జి. ఓబులేసు తెలిపారు. నిందితుడిపై గతంలో 7 క్రిమినల్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదయినట్లు తెలిపారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సీఐ వివరాలను తెలియజేశారు. చిన్నచౌక్ , రైల్వేకోడూరు, తిరుపతి వెస్ట్ ,తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లలో ఆటో దొంగతనాలుకు పాల్పడగా కేసులు నమోదు చేశారన్నారు. చెన్నూరు కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా అతడు పలు కేసులలో నిందితుడిగా ఉన్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్‌స్పెక్టర్ ఓబులేసు, ఎస్‌ఐలు రాజరాజేశ్వరరెడ్డి రవికుమార్ సిబ్బందితో కలసి ప్రత్యేక బృందం ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని గుర్తించామన్నారు. శుక్రవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని చలమారెడ్డిపల్లి క్రాస్ రోడ్ వద్ద నిందితుడిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కేసును విజయవంతంగా 24 గంటల్లోపే ఛేదించిన సీఐ, ఎస్‌ఐలతో పాటు హెడ్ కానిస్టేబుల్స్ వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాధర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డిలను కడప డిఎస్పీ అభినందించారన్నారు. రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు.