
మండపాల వద్ద జాగ్రత్తలు తప్పనిసరి
కడప కార్పొరేషన్: వర్షాలు పడుతున్న నేపథ్యంలో వినాయక మండపాల వద్ద విద్యుత్‌పై తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యుత్ మండపాల వద్ద లైటింగ్ అలంకరణ నిర్మాణాలకు, సౌండ్ సిస్టంకు, విద్యుత్ ఉపకరణాలకు ఉపయోగించే వైర్లు నాణ్యమైనవిగా ఉండాలన్నారు. వర్షాలకు భూమిపై తేమ ఉండడం వల్ల చిన్నపాటి అతుకులు ద్వారా పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని, అతుకు లు లేని నాణ్యమైన వైర్లు ఉపయోగించి విద్యుత్ ప్రమాదాలను నివారించాలని సూచించారు. భారీ, ఎత్తైన విగ్రహాల ఊరేగింపుల సమయాలు, ఊరేగింపు మార్గాన్ని స్థానిక విద్యుత్ కార్యాలయాల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఉత్స వ కమిటీ సభ్యులు దీనిపై చొరవ చూపాలని కోరారు.
విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వినాయక చవితి పండుగ నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగడానికి ఆస్కారమున్నా, ప్రమాదాలు జరిగినా తక్షణం స్పందించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కడప విద్యుత్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వినాయక మండపాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామన్నారు. వినాయక మండపాల నిర్వాహకులు విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఏదైనా ప్రమాదం జరిగిన వెంటనే సంబంధిత విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్– 9440817440కు ఫోన్ చేయాలన్నారు. అలాగే విద్యుత్ శాఖ వాట్సాప్ నెంబరునకు 9440814264 మెసేజ్ పెట్టాలన్నారు. టోల్ ఫ్రీ నెంబర్ 1912 నకు కూడా తెలియజేయవచ్చని తెలిపారు.
వర్షాల్లో అతుకులు పడ్డ వైర్లు మరింత ప్రమాదకరం
జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్.రమణ