
బ్యాలెట్ బాక్స్‌లపై శిక్షణ
కడప సెవెన్‌రోడ్స్: ప్రిసైడింగ్ అధికారులకు బ్యాలెట్ బాక్స్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జెడ్పి సీఈవో – రిటర్నింగ్ అధికారి ఓబులమ్మ తెలిపారు. బుధ వారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్ హాలులో ప్రిసైడింగ్ అధికారులకు, ఏపీఓలకు బ్యాలెట్ బాక్స్‌ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సి.ఓబుళమ్మ, పులివెందుల అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ వెంకటపతి, ఒంటిమిట్ట అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రంగస్వామి, డివిషనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వి.విజయలక్ష్మి, వి.రామాంజనేయులు , రిసోర్స్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా, పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ షాకీర్‌ను రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
రైతులందరికీ
యూరియా అందజేస్తాం
వేంపల్లె: జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, రైతులందరికి అందిస్తామని వ్యవ సాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర నాయక్ పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని ఎరువులు దుకాణాలను వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్ర నాయక్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో వరి నాట్లు సాగు చేస్తుండడంతో యూరియా ఎక్కువగా అవసరం అవుతోందన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎరువులు ఆర్‌ఎస్‌కే, ప్రైవేటు డీలర్లు వద్ద అందుబాటులో ఉంటాయన్నారు. యూరియాతోపాటు భాస్వరం, పొటాషియం ఎరువులను తప్పకుండా వేయాలని రైతులకు సూచించారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ రెడ్డి పాల్గొన్నారు.

బ్యాలెట్ బాక్స్‌లపై శిక్షణ