గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం | - | Sakshi
Sakshi News home page

గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం

Aug 7 2025 7:46 AM | Updated on Aug 7 2025 8:14 AM

గండిక

గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం

కొండాపురం : గండికోట ప్రాజెక్టు నీటిలో రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఓ యువకుడు శవం బుధవారం లభ్యమైనట్లు కొండాపురం ఎస్‌ఐ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఎస్‌ఐ వివరాల మేరకు.. మండలంలోని పాత కొండాపురం–ఏటూరు వైపు వెళ్లే పాతదారి వద్ద రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనుక జలాల్లో 4.5 అడుగుల గుర్తుతెలియని మృత దేహం కనిపించడంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని మృత దేహాన్ని బయటికి తీశారు. మృతుడు జీన్స్‌ ఫ్యాంట్‌ ధరించాడని, వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మద్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఎస్‌ఐ 9121100612, సీఐ 9121100611 ఫోన్లకు సమచారం ఇవ్వాలని తెలిపారు.

కుక్కల దాడిలో మేక పిల్లల మృతి

తొండూరు : మండలంలోని కోరవానిపల్లె గ్రామానికి చెందిన కొప్పల రామ్మోహన్‌కు చెందిన 22 గొర్రె, మేక పిల్లలు మంగళవారం అర్థరాత్రి కుక్కల దాడిలో మృతి చెందాయి. ఈ సందర్భంగా బాధిత గొర్రెలకాపరి రామ్మోహన్‌ మాట్లాడుతూ గొర్రె, మేక పిల్లలు చనిపోవడంతో దాదాపు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని నష్టాన్ని గుర్తించి, నష్టపరిహారం అందించాలని కోరారు.

పిడుగుపాటుకు గొర్రెలు మృతి

ముద్దనూరు : మండలంలోని చౌటిపల్లె స మీపంలో పిడుగుపడడంతో పది గొర్రెలు బుధవారం మృతి చెందాయి. బాధితుల సమాచారం మేరకు మంగళవారం రాత్రి భారీ మెరుపులతో కూడిన వర్షం కురిసి పిడుగుపడింది. గొర్రెల కాపరి సత్యనారాయణ పిడుగుపాటుకు స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో మందలో వున్న పది గొర్రెలు మృతిచెందాయి. పిడుగుపాటుకు గురైన వ్యక్తి చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు.

గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం1
1/1

గండికోట డ్యాంలో గుర్తుతెలియని మృతదేహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement