సాక్షి టాస్క్‌ఫోర్స్: టీడీపీ ఇన్‌చార్జ్ బీటెక్ రవి అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తున్నారు. గతంలో ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు చేసిన ఆయన తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. భౌతిక దాడులు.. హత్యాయత్నం ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. తీవ్ర ఘర్షణలు..అల్లర్లు సృష్టించేందుకే నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమందిని బ్యాచ్‌లుగా ఎంపిక చేసి.. ఎంచుకున్న వారిపై హత్యాయత్నానికి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
● టీడీపీ ఇన్‌ఛార్జి బీటెక్ రవికి హైటెక్ తెలివితేటలు అధికమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అది నిజమని పలుమార్లు రుజువైంది. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మా రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. ఒకే ఒక ఎంపీటీసీ సభ్యుడి ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. మెజార్టీ సభ్యుడిగా ఉన్న కొమ్మారామలింగారెడ్డి హత్యతో ఎంపీపీ ఖాళీ ఏర్పడితే ఆస్థానం గెలుపొంది చేజేక్కించుకోవచ్చునే ఎత్తుగడను బీటెక్ రవి ప్రయోగించారు. వెరసి ఎంపీపీ కొమ్మా రామలింగారెడ్డి హత్య తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆపై ఏర్పడ్డ ఫ్యాక్షన్ నేపధ్యంలో ప్రతీకార హత్యలు లేకపోలేదు.
ఇంటి వాస్తు కోసం రోడ్డుకు
అడ్డంగా గోడ ఏర్పాటు
కసనూరు గ్రామానికి చెందిన బీటెక్ రవి సింహాద్రిపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి పరమడ వైపు రోడ్డు ఉంది. రోడ్డు అడ్డంగా గోడ కట్టారు. కారణమేమంటే వాస్తుకు అనువుగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు. అటువైపు ఇళ్లున్న వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. బీటెక్ రవి అనుచరులు దాడులు చేస్తారనే భయం వారిని బాహాటంగా ప్రశ్నించకుండా చేసింది. ఫలితంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించినా చూస్తుండిపోయిన దుస్థితి నెలకొంది.
జెడ్పీటీసీ ఎంట్రీలోనూ అదే పరిస్థితి...
సింహాద్రిపురానికి చెందిన బీటెక్ రవి తన సతీమణి లతాను పులివెందుల జెడ్పీటీసీగా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణం, రూరల్‌లో దందాలు, సెటిల్‌మెంట్లు మొత్తం వ్యవహారం గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. స్థానికంగా టీడీపీ నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నా, బీటెక్ రవి తన కుటుంబ సభ్యుల్ని పోటీలో దింపడం వెనుక ఈ ప్రాంతంపై పట్టు సాధించాలనే తపన అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌రెడ్డి లోకల్. ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత నాన్ లోకల్ అయినప్పటికీ పోటీకి ఆసక్తి చూపడం వెనుక బహుళ ప్రయోజనాలున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు.
పులివెందుల ప్రశాంతతకు భంగం...
ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ప్రజలు, రైతులు కక్షలకు దూరంగా ఉండి పూర్తిగా వ్యవసాయం బాటపట్టారు. అందుకు అనువైన పరిస్థితులు మహానేత కల్పించారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు వచ్చి చేరింది. ఆదాయం కళ్లు చూడడం, క్రమేపి ప్రశాంత వాతావరణానికి జనాలు అలవాటు పడ్డారు. 2004 నుంచి 2024 వరకూ పులివెందులలో ప్రశాంత వాతావరణం కొనసాగేది. కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతతకు భంగం ఏర్పడింది. తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అది మరింత ఎక్కువైంది. మంగళవారం రాత్రి సైదాపురం సురేష్‌కుమార్‌రెడ్డి, అమరేష్‌రెడ్డి టార్గెట్‌గా హత్యాయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం నల్లగొండుగారిపల్లెలో ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి టార్గెట్‌గా హత్యాయత్నం చేశారు. టీడీపీ మూకలు బరితెగించి గ్రామస్తుల సమక్షంలోనే వేల్పుల రామలింగారెడ్డి హత్యకు విశ్వయత్నం చేశారు. పెట్రోల్ పోసి నిలువునా అంటించడానికి ప్రయత్నించారు. వాహనాలు ధ్వంసం చేశారు. అద్దాలను సమ్మెటతో పగలగొట్టి వాహనంలోకి పెట్రోల్ చల్లారు. తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నల్లగొండుగారిపల్లె గ్రామస్తులు అడ్డుగా నిలవడంతో వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బతికిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అరాచకానికి నిలువెత్తు రూపంగా బీటెక్ రవి నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
నాడు ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు!
తాజాగా పులివెందులలో ఎంట్రీలోనూఇదే సంస్కృతికి బీజం
పట్టణ ప్రశాంతత కలుషితం అవుతోందనిప్రజాస్వామ్యవాదుల ఆవేదన
లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా రంగప్రవేశం వెనుక అతి పెద్ద స్కెచ్
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉ
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉ