టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి | - | Sakshi
Sakshi News home page

టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి

Aug 7 2025 7:48 AM | Updated on Aug 7 2025 8:14 AM

టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి

టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పండి

పులివెందుల: సాధారణ ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చి మోసం చేసిన టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పాలని కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని కనంపల్లె పంచాయతీలో బుధవారం ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్‌ యాదవ్‌లతో కలిసి ఇంటింటి జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 12న జరిగే జెడ్పీటీసీ ఎన్నికలలో ఫ్యాన్‌ గుర్తుపై ఓటు వేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హేమంత్‌రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలం చెందిందని విమర్శించారు. ఎన్నికల హామీలో భాగంగా ఇచ్చిన సూపర్‌ సిక్స్‌, సూపర్‌ సెవెన్‌లు అమలు చేయకుండా ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేస్తోందన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఏడాదికి పీఎం కిసాన్‌తో సంబంధం లేకుండా ఒకేసారి రూ.20వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకు ఇస్తామన్న పింఛన్‌ పథకం ఏమైందని ధ్వజమెత్తారు. పథకాలు అమలు చేయలేని ప్రభుత్వాన్ని విమర్శిస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈ జెడ్పీటీసీ ఎన్నికలను సజావుగా నిర్వహిస్తే ఎక్కడ ఓడిపోతామోనని వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడు లు చేస్తూ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని విమ ర్శించారు. అధికార పార్టీ నాయకులు చేస్తున్న అక్రమాలను, దాడులను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులను బైండోవర్‌ పేరుతో పోలింగ్‌కు రాకుండా నియంత్రించే ప్ర యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి దుర్మార్గాలను చేస్తున్న టీడీపీ నాయకులకు గట్టిగా బుద్ధి చెప్పాలంటే వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్‌రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.

కనంపల్లెలో ఘన స్వాగతం

మండలంలోని కనంపల్లె గ్రామంలో బుధవారం కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డికి ఘనంగా గ్రామస్తులు స్వాగతం పలికారు. జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కనంపల్లెలో ఇంటింటి ఎన్నికల ప్రచారానికి విచ్చేసిన ఆయనకు విశేష ఆదరణ లభించింది. ప్రచారంలో భాగంగా జగనన్న పాటకు మహిళలు నృత్యాలు చేస్తూ జై జగన్‌ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

హేమంత్‌ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించండి

వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్‌ ఫోరం

రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి

పులివెందుల: ఈనెల 12వ తేదీన జరిగే జెడ్పీటీసీ ఉప ఎన్నికలలో పులివెందుల మండలం జెడ్పీటీసీ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్‌ రెడ్డిని అఖండ మెజార్టీతో గెలిపించాలని వైఎస్సార్‌సీపీ ఇంటలెక్చువల్‌ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు వై.ఈశ్వర ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పరిపాలనలో పులివెందుల ఎంతో ప్రశాంతంగా ఉండేదన్నారు. ఎలాంటి దాడులు గానీ, దుస్సంఘటనలు గానీ జరగలేదని, అలాంటిది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు పెరిగిపోయాయన్నారు. మన పులివెందుల ప్రశాంతంగా ఉండాలంటే, మరింత అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించుకోవాలని, ఇక్కడి ప్రాంతాన్ని, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

జెడ్పీటీసీ ఎన్నికలలో వైఎస్సార్‌సీపీఅభ్యర్థిని గెలిపించండి

జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలోఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement