
దొంగకు దేహశుద్ధి
సింహాద్రిపురం : ఓ దొంగను గ్రామస్తులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. సింహాద్రిపురం మండలంలోని సుంకేసుల గ్రామంలో కాకర్ల భాస్కర్‌రెడ్డి భార్య తన ఇంటి వద్ద శుక్రవారం కల్లాపు చల్లుతూ ఉండగా.. బైకుపై ఇద్దరు వ్యక్తులు వచ్చారు. బైకుపైనే ఒకరు ఉండి మరొకరు ఆమె వద్దకు వచ్చి వివరాలు అడిగేటట్టు అడిగి.. మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లి బైకుపై వెళ్లిపోయారని బాధితురాలు పూర్ణ విలపించింది. అలాగే అంకాలమ్మ గూడూరులో గ్రామానికి చెందిన చిన్నిరెడ్డి తన తోట వద్ద ట్రాక్టర్ ఆపి పనులు చేసుకుంటూ నిమగ్నమై ఉండగా, దొంగ ట్రాక్టర్‌కు ఉన్న బీగం గమనించి స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. రైతు ట్రాక్టర్ శబ్దాన్ని గమనించి బయటికి వచ్చి చూసేసరికి ట్రాక్టర్ చాలా దూరం వెళ్లిపోయింది. దీనితో బాధిత రైతు వెంటనే గ్రామస్తులకు ఫోన్ చేయడంతో వారు ఆ ట్రాక్టర్‌ను వెంబడించి దొంగను పట్టుకుని దేహశుద్ధి చేసి ట్రాక్టర్‌కు తాడుతో కట్టారు. గ్రామస్తులు దొంగను పట్టుకొని దబాయించగా పొంతన లేని సమాధానాలు చెబుతుంటే.. పోలీసులకు సమాచారమిచ్చి పోలీసులకు అప్పగించారు. అయితే ఆ దొంగ నా పేరు సురేష్, నాది అనంతపురం జిల్లా బత్తలపల్లి సమీపంలోని డి.చెర్లోపల్లె గ్రామం అని చెప్పారు.