
ది బర్నింగ్ ట్రైన్!
రాజంపేట: తాము ప్రయాణిస్తున్న రైలులో పొగలు.. చిన్నపాటి మంటలు వచ్చిన వెంటనే 1980లో హిందీ భాషలో విడుదలైన ది బర్నింగ్ ట్రైన్‌నే ప్రయాణికులు గుర్తుచేసుకునే పరిస్థితులు నేడుకలిగాయి. ఇటీవల భారతీయ రైల్వేలో జరుగుతున్న అగ్నిప్రమాదాల భయం ప్రయాణికులను వెంటాడుతోంది. ఇటీవల తిరుపతి ఫిట్ లైన్‌లో రైలు ఫార్మిసిన్‌లోని బోగీలు కాలి బూడిదకావడంతోపాటు, తిరువళ్లూరులో ఆయిల్‌ట్యాంకర్లు కాలిపోయిన సంఘటనలు ప్రయాణికుల్లో ఆందోళనకు గురిచేస్తున్నాయి.
ప్రయాణికులే అప్రమత్తం..
తమ ప్రయాణంలో అగ్నిప్రమాదాలకు దారితీసే సంఘటనలపై ప్రయాణకులు అప్రమత్తమవుతన్నారు. అధికారులకు సైతం సమాచారం ఇస్తున్నారు. ఆదివారం అన్నమయ్య జిల్లా నందలూరు–హస్తవరం రైల్వేస్టేషన్ల మధ్య కన్యాకుమారి నుంచి పుణేకు వెళుతున్న జయంతి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులు సకాలంలో స్పందించమే ఇందుకు నిదర్శనం.
రైలును వదిలేసి పరుగులు...
తాము ప్రయాణిస్తున్న రైలులో పొగలు, మంటల వ్యాపిస్తే వెంటనే చైన్ పుల్ చేసి రైలును వదిలేసి పరుగులు తీస్తున్నారు. తమ ప్రాణాలను తామే కాపాడుకునే విధంగా వ్యవహరిస్తున్నారు.జయంతి ఎక్స్‌ప్రెస్‌రైలు ప్రయాణికులు ఇదే చేశారు. ఎసీబోగీ బీ–2లో పొగ వ్యాపిస్తున్న క్రమంలో రైలును ఆపివేయించారు. అందులో నుంచి దిగేశారు. దూరంగా వెళ్లిపోయారు. పొగలను ఎసీబోగీ సిబ్బంది అగ్నిమాపక యంత్రాల ద్వారా అదుపు చేశారు.
● జయంతి ఎక్స్‌ప్రెస్ రైలులోని ఎసీబోగీ బీ–3లో కూడా పొగలు వస్తే చెయ్యేరు బ్రిడ్జి దాటగానే ప్రయాణికులే చైన్ పుల్ చేసి, నిలిపివేసిన సంఘటన రైల్వే అధికారులను కూడా విస్మయానికి గురిచేసింది.
హంసఫర్ నిలిపివేత: జయంతి రైలు ఫార్మసిన్ పొగలు వచ్చిన సంఘటనతో రైల్వే అధికారులు అప్రమత్తమై కశ్మీరు రైలు(హంసఫర్)ను నందలూరులోనే నిలిపివేశారు. ప్రయాణికులు బోగీల్లోనుంచి బయటికి రావడం, అలాగే పక్కలైనులో వేగంగా మరో రైలు వెళితే గాలికి పొగలు మరింతగా వ్యాపించే అవకాశాలు ఉంటాయి. ఆ కారణంతో హంసఫర్‌ను నిలిపివేశారు.
టీఎక్స్‌ఆర్ విభాగం లేకనే..
స్టీమ్ ఇంజిన్‌లోకోషెడ్ కొనసాగుతున్న నేపథ్యంలో నందలూరు రైల్వేకేంద్రంలో మూడు దశాబ్దాల కింద టీఎక్స్‌ర్ విభాగం ఉండేది. ఈ మార్గంలో నడిచే గూడ్స్ , ప్యాసింజర్ రైళ్లను టీఎక్స్‌ఆర్ సిబ్బంది నిశితంగా పరిశీలించేవారు. ఇప్పుడు ఆ విభాగాన్ని ఎత్తివేశారు. నందలూరు రైల్వేకేంద్రాన్ని నిర్వీర్యం చేసే క్రమంలోనే టీఎక్స్‌ఆర్ విభాగాన్ని ఎత్తివేశారనే ఆరోపణలు నేటికి వినిపిస్తున్నాయి. అయితే జయంతి రైలుకు బ్రేక్‌బైడింగ్‌్ సమస్యను తిరుపతి టీఎక్స్‌ఆర్‌లో పనిచేసే యల్లయ్య రెస్ట్‌లో నందలూరుకు వచ్చి ఉంటే ఆయనను రైల్వే అధికారులు పిలిపించి మరమ్మతులు చేయించారు. ఆయనను కడప వరకు రైలులో ప్రయాణించేలా చేశారు.
వెంటాడుతున్న ‘అగ్ని’ప్రమాదాల భయం
పొగలు, మంటలు వచ్చిన రైలు వదిలేసి ప్రయాణికుల పరుగులు