
ఎమ్మెల్యే, ఆమె భర్త అండతోనే తిరుమలేష్ అవినీతి అక్రమాలు
కడప కార్పొరేషన్ : కడప ఎమ్మెల్యే ఆర్.మాధవి, ఆమె భర్త టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి(వాసు) అండతోనే వారి అనుచరుడు టీఎన్‌ఎస్‌ఎఫ్ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్ అవినీతి అక్రమాలకు పాల్పడ్డాడని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయి దత్త ఆరోపించారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్యార్థి విభాగం నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాడకుండా అక్రమ వసూళ్లు, సెటిల్‌మెంట్లకు పాల్పడుతున్నాడన్నారు. తాను చేస్తున్న అక్రమాలకు ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి పేరు చెప్పుకుని అందరినీ బెదిరించాడన్నారు. మహానాడు సందర్భంగా జిల్లాలో విద్యాసంస్థల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేశాడని ఆరోపించారు. ఎమ్మెల్యే మెప్పు కోసం మేయర్ సురేష్ బాబు ఇంటిపై చెత్త వేశాడని, ఎలాంటి సంబంధం లేకపోయినా మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా ఇంటి వద్ద ధర్నా చేయించాడన్నారు. సాక్షి కార్యాలయం లోపలికి చొరబడి దాడి చేసేందుకు కూడా ప్రయత్నించాడన్నారు. రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శి సందీప్‌రెడ్డి, నగర అఽధ్యక్షుడు శివారెడ్డి, జబ్బార్, నౌమాన్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.