
ప్రజల దృష్టిని మళ్లించేందుకే అక్రమ అరెస్టులు
కమలాపురం: రాష్ట్రంలో నెలకొ న్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే కూటమి సర్కార్ వైఎస్సార్ సీపీ నేతలను అక్రమ అరెస్టులు చేస్తోందని ఆ పార్టీ స్టేట్ జాయింట్ సెక్రటరీ షేక్ ఇస్మాయిల్ అన్నారు. మంగళవారం ఆయన కమలాపురంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని ఈ సర్కార్ అక్రమంగా అరెస్ట్ చేసిందని మండిపడ్డారు. అక్రమ అరెస్ట్‌లతో వైఎస్సార్ సీపీని అడ్డుకోలేరని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా విజయం తమ పార్టీదేనని స్పష్టం చేశారు. ఈ అక్రమ అరెస్టులపై రాష్ట్ర ప్రజలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికల సమయంలో జవాబు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అక్రమ అరెస్టులు ఆపి ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలపై , రాష్ట్ర సమస్యల పై దృష్టి పెట్టాలని ఆయన హితవు పలికారు. సూపర్ సిక్స్ అమలుపై ప్రశ్నించకూడదని భావించిన కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకే వైఎస్సార్ సీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ సీపీ స్టేట్ జాయింట్
సెక్రటరీ షేక్ ఇస్మాయిల్