
వర్షాలు పలకరించినా.. కలవరమే!
● సబ్సిడీ ఖరారు...
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేయనున్న వేరుసెనగ విత్తన కాయలకు ప్రభుత్వం ధరలకు ఖరారు చేసింది. వేరుశనక్కాయలకు సంబంధించి 40 శాతం రాయితీ ఇవ్వనుండగా రైతులు వాటా 60 శాతం చెల్లించాల్సి ఉంటుంది. పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి 50 శాతం సబ్సిడీని కేటాయించారు. ఇందులో జనుములు కిలో రూ. 123 రుపాయలుగాకా 50 శాతం సబ్సిడీ ఉంటుంది. అలాగే జనుములు కిలో రూ.109 కాగా రూ. 54.5, పెసలు కిలో రూ. 180 కాగా రూ. 90 వంతున రైతులు చెల్లించాల్సి ఉంటుంది.
కడప అగ్రికల్చర్: నైరుతి రుతు పవనాలు పలకరించాయి. జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. రైతన్నలు కాడిమేడీని సిద్ధం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇంత జరుగుతున్న రైతన్నలు కావాల్సిన వేరుశనక్కాయ లు సిద్ధం చేయడంలో ప్రభుత్వం వెనకబడి పోయింది. సబ్సిడీ విత్తనాల ధరలు ఖరారు చేసిన ప్రభుత్వం విత్తనకాయలు సిద్ధం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతానికి పచ్చిరొట్ట విత్తనాలకు సంబంధించి 4567 క్వింటాళ్లకుగాను కేవలం 500 క్వింటాళ్ల జనుములు మాత్రమే వచ్చాయి. మిగతా జీలుగలు, మినుములు, పెసలతోపాటు అతి ముఖ్యమైన వేరుశనక్కాయలు కూడా రాలేదు. సాగుకు అవసరమైన విత్తనాలు కనీస స్థాయిలో కూడా రాకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
మరో వారం రోజుల్లో...
ఖరీప్ సీజన్ మరో వారం రోజుల్లో ప్రారంభం కానుంది. మొట్టప్రాంతంలో చాలా మంది రైతులు వర్షాధారంతో వేరుసెనగ పంటను సాగు చేయనున్నారు. వేరుశన క్కాయలకు సంబంధించి కే–6 రకం 3122 క్వింటాళ్లు, టీసీజీఎస్ రకం 297 క్వింటాల్, కదిరి లేపాక్షి రకం 200 క్వింటాల్, నారాయణి 1347 ఇలా మొత్తం జిల్లాకు 4966 కింటాళ్లు కేటాయించగా కేవలం కే–6 రకానికి సంబంధించి 3250 క్వింటాళ్లను మంజూరు చేశారు. ఇవి కూడా ఇంతవరకు జిల్లాకు రాలేదు. మారో వారం రోజులు పట్టనున్నట్లు అధికారులు వెల్లడిస్తుండడం గమనార్హం.
వేరుశనక్కాయ ధరలు ఇలా (క్వింటా)
రకం పూర్తి ధర రాయితీ రైతు వాటా
మరో వారం రోజుల్లో..
ప్రభుత్వం సబ్సిడీ కింద మంజూరు చేసిన వేరుశనక్కాయలు మారో వారం రోజుల్లో జిల్లాకు వస్తాయి. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీ ఖరారు చేసింది. ప్రభుత్వ సబ్సిడీ 40 శాతం కాగా రైతు వాటా 60 శాతంగా కేటాయించారు. విత్తనాలు కావాల్సిన రైతులు రైతు సేవా కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకోవాలి. – జగదీష్, ఏపీ సీడ్స్ జిల్లా మేనేజర్
టీడీపీ రైతు వ్యతిరేక ప్రభుత్వమని మరోసారి రుజువైంది. అన్నదాతల సంక్షేమం పట్టదని సబ్సిడీ విత్తనకాయల సాక్షిగా తెలిసిపోయింది. నైరుతి ముందే వస్తుందని తెలిసినా.. తొలకరి పలకరిస్తున్నా.. సకాలంలో సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతన్నలతో ఆటలాడుకుంటోంది. ఖరీఫ్ సాగు ఆదిలోనే ఆటంకాలు కలిగిస్తోంది.
కే–6 9300 3720 5580
టిసిజిఎస్ 9300 3720 5580
నారాయణి 9500 3800 5700
ఇంకా జిల్లాకు రాని సబ్సిడీ వేరుశనక్కాయలు
విత్తనాల కోసం రైతన్నలు ఎదురుచూపులు

వర్షాలు పలకరించినా.. కలవరమే!

వర్షాలు పలకరించినా.. కలవరమే!

వర్షాలు పలకరించినా.. కలవరమే!