
అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!
సాక్షి కడప: మహానాడుతో ప్రజలు తిప్పలు పడ్డారు. కడప శివారు చుట్టూ ఎటుపోయినా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కిచిక్కి విలవిల్లాడారు. వాహనాలు కదలక...అడుగు ముందుకు పడక....ఎటువైపు పోలేక సతమతమయ్యారు. కడప నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతూ అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పరిస్థితిని తెలుసుకుని డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర పోలీసు అధికారులు వచ్చి ట్రాఫిక్‌ను కొంతమేర క్రమబద్ధీకరించినా తర్వాత మళ్లీ యథాస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య టీడీపీ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులకూ తగిలింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ నేతలు ఇష్టానుసారం వాహనాలు నిలబెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించా రు. పలుచోట్ల టీడీపీ నేతలు ట్రాఫిక్‌ను సరిదిద్దుతు న్న పోలీసులపైనే రుసరుసలాడడం కనిపించింది.
మందుబాబులం.. మేము మందుబాబులం...
మహానాడు సందర్భంగా మందుబాబులు ఫుల్ జోష్‌లో కనిపించారు. వైన్‌షాపుల వద్ద ఎక్కువ సంఖ్యలో పచ్చ చొక్కాల వారే కనిపించడం గమనార్హం. ఓ వైపు జనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుపోగా.. మరోవైపు తమ్ముళ్లు కిక్కులో గడిపారు.
రింగ్ రోడ్డు వెంబడి నిలిచిపోయిన వాహనాలు
అటు, ఇటుపోలేక ప్రజలకు తిప్పలు

అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!

అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!

అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!

అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!