
ఎమ్మెల్సీ సీఆర్‌సీ, సుగవాసి డుమ్మా!
సాక్షి ప్రతినిధి, కడప: బలిజ సామాజికవర్గనేతల్ని టీడీపీ విస్మరిస్తోందా...ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా దూరం పెట్టిందా...అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య, సుగవాసి బాలసుబ్రమణ్యం మహానాడుకు దూరంగా ఉండడమే దీనికి నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎన్నో పదవులు అలంకరించిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ పార్టీలో కనుమరుగయ్యారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడమే అని తెలుస్తోంది. భవిష్యత్‌లో తమకు అడ్డుగా నిలుస్తారనే అభద్రతాభావంతో స్థానిక నేతలు ఎన్నికల వరకు వాడుకొని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. దీంత ఉనికి కోసమే పార్టీలో ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పసువు పండుగగా చెప్పుకుంటున్న మహానాడుకు గైర్హాజరయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు.
రాయలసీమ బలిజ నేతలకుపొగబెడుతున్న టీడీపీ
మహానాడుకు దూరంగా ఉండిపోయిన నేతలు

ఎమ్మెల్సీ సీఆర్‌సీ, సుగవాసి డుమ్మా!