
అశ్రునయనాల నడుమ ప్రమాద మృతులకు అంత్యక్రియులు
నివాళులర్పించిన ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి
బద్వేలు అర్బన్/బి.కోడూరు : గువ్వల చెరువు ఘాట్‌రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చింతపుత్తాయపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శిరీషల అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల నడుమ ముగిశాయి. బంధువులు, స్నేహితులు కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉంటే బి.కోడూరు మండలంలోని గంగిరెడ్డిపల్లె సాయిహర్షిణి, రుషికేశవరెడ్డిల మృతదేహాలకు భారీ జనసందోహంతో కన్నీటి వీడ్కోలు పలికారు.
పిల్లలను కడసారి చూసేందుకు తల్లిదండ్రులైన జర్మనీ నుండి వచ్చిన తిరుపతిరెడ్డి, కడసారి చూపు కోసం ఆసుపత్రి నుండి అంబులెన్స్‌లో తీసుకువచ్చిన శశికళలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ బూత్‌కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్‌రెడ్డి, నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, బి.కోడూరు మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డిలు మృతదేహాలకు నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరి వెంట చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మీనరసారెడ్డి, జయరామిరెడ్డి, పోలిరెడ్డి, యోగానందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.

అశ్రునయనాల నడుమ ప్రమాద మృతులకు అంత్యక్రియులు