మోడల్‌ మెగా డీఎస్సీ పరీక్షను జయప్రదం చేయాలి | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ మెగా డీఎస్సీ పరీక్షను జయప్రదం చేయాలి

May 27 2025 12:26 AM | Updated on May 27 2025 12:26 AM

మోడల్‌ మెగా డీఎస్సీ పరీక్షను జయప్రదం చేయాలి

మోడల్‌ మెగా డీఎస్సీ పరీక్షను జయప్రదం చేయాలి

కడప ఎడ్యుకేషన్‌ : జిల్లా వ్యాప్తంగా ఈనెల 27వ తేదీన ఆర్‌ఎస్‌ఎఫ్‌ నేతృత్వంలో నిర్వహించనున్న మోడల్‌ మెగా డీఎస్సీ పరీక్షను డీఎస్సీ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు డి.ఎం. ఓబులేసు యాదవ్‌ కోరారు. మెగా డీఎస్సీకి సంబంధించిన పోస్టర్‌ను సోమవారం కడపలోని వెంకట సాయి కోచింగ్‌ సెంటర్‌లో డైరెక్టర్‌ దామోదర్‌ రెడ్డితో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ మోడల్‌ పరీక్షకు ఎస్‌జీటీ అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఎంట్రీ ఫీజు 50 రూపాయలు ఉందన్నారు. అభ్యర్థులు కడపలో 8639919308 నెంబర్‌కు ఫోన్‌ చేసి పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే కడపలోని వెంకటసాయి కోచింగ్‌ సెంటర్‌, యూటీఎఫ్‌ భవన్‌లో కూడా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. జమ్మలమడుగులో 8886238055 నంబర్‌ లేదా వివేకానంద జూనియర్‌ కాలేజీలో, ప్రొద్దుటూరులో 7036695591 నంబర్‌ లేదా సృజన్‌ కోచింగ్‌ సెంటర్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement