
వైస్ విగ్రహాలకు కట్టిన పసుపు జెండాలు తొలగించకుంటే ఆందో
వల్లూరు : మహానాడు సందర్భంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పసుపు జెండాలు, తోరణాలను కట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. కడపలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా జెండాలు గానీ, లేక మరేవైనా కట్టినప్పుడు మరుసటి రోజే తొలగించే కార్పొరేషన్ అధికారులు అధికార టీడీపీ పట్ల అతి ప్రేమ చూపుతూ పసుపు జెండాలు, తోరణాలను అలాగే ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా అధికారులు విజ్ఞతతో స్పందించి వైఎస్ విగ్రహాల వద్ద ఉన్న పసుపు పచ్చ జెండాలను, తోరణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోతే మంగళవారం ఉదయం 11 గంటలకు కడప – మైదుకూరు రోడ్డులో ఉన్న ఇర్కాన్ సర్కిల్‌లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు.
అధికారులను సొంత పార్టీ పనులకు
ఉపయోగించడం సిగ్గుచేటు
మహానాడు పూర్తిగా టీడీపీకి చెందిన సొంత కార్యక్రమం, అలాంటి సొంత పనులకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం అఽధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర జిల్లా స్థాయి అఽధికారులు సైతం ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్లు మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ిసిగ్గుచేటని విమర్శించారు. మహానాడు వద్ద కేటాయించిన విధులకు హాజరయ్యేందుకు వస్తూ కటౌట్ విరిగి ఇద్దరు వీఆర్‌ఓలు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు.
మహానాడు కాదది విద్రోహ నాడు
సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మోసగించి అఽధికారంలోకి వచ్చిన టీడీపీ సంవత్సర పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సంవత్సరం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దాని నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇది మహానాడు కాదని, విద్రోహనాడని ఆయన ధ్వజమెత్తారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి