
తీగలు తగిలి గేదె మృతి
సింహాద్రిపురం : మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన గంగిరెడ్డికి చెందిన గేదె విద్యుత్తు షాక్‌కు గురై మృతిచెందింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాజారెడ్డి, రవీంద్రనాథరెడ్డి తమ గేదెలను సమీపాన ఉన్న చెరువు గట్టున మేపుకొనేందుకు తీసుకెళ్లారు. గంగిరెడ్డికి చెందిన గేదె అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ తీగలకు తగలడంతో షాక్‌కు గురై మృతి చెందింది. రూ.92వేలు నష్టపోయానని బాధిత రైతు గంగిరెడ్డి తెలిపారు.
హత్య కేసులో ముగ్గురి అరెస్టు
జమ్మలమడుగు రూరల్ : ఇంటి ముంగిట పేడ నీళ్లు చల్లుకునే విషయంలో జరిగిన ఘర్షణళక్ష శుక్రవారం ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ లింగప్ప తెలిపారు. ఈ నెల 10న మండలంలోని పి.బోమ్మేపల్లిలో పేడనీళ్లు చెల్లుకునే విషయంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. పరస్పరం దాడులు చేసుకోవడంతో గాయాలపాలైన రాజ చౌడప్ప మృతి చెందాడు. ఈ హత్య కేసులో ఇది వరకే నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం బొగ్గు నడిపి సుబ్బరాయుడు, అతడి కుమారుడు నడిపి సుబ్బరాయుడు, నాగంజి అనులను ఆదివారం అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
డేంజర్ జోన్‌లో
క్వారీకి ఎలా అనుమతిస్తారు ?
ఓబులవారిపల్లె : డేంజర్ జోన్‌గా ప్రకటించినప్పటికీ.. ఏపీఎండీసీ మంగంపేట గనికి 500 మీటర్ల దూరంలో కంకర క్వారీకి ఎలా అనుమతిస్తారని గోవిందంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం కా రణంగా తమ పంటలు నష్టపోతున్నామని మైన్స్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి శుక్రవారం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారితో మాట్లాడుతూ కంకర క్వారీలో నిర్వహించే భారీ పేలుళ్ల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, శ్వాసకోశ, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడి చాలామంది మృతి చెందారని ఆరోపించారు. తమ ఆస్తులు అమ్ముకున్నా ఆసుపత్రులకు సరిపోదని వారు వాపోయారు. గోవిందంపల్లి ప్రజలను కాపాడాలని, చర్య లు తీసుకోకపోతే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏడీ సుబ్రమణ్యం కంకర క్వారీ క్రషర్‌లను పరిశీలించి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రంమలో రామసుబ్రహ్మణ్యం, సింగ్, గోపీనాథ్ పాల్గొన్నారు.

తీగలు తగిలి గేదె మృతి