
ఎస్పీ ఈజీ అశోక్ కుమార్
పటిష్ట బందోబస్తు
కడప అర్బన్: కడపలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న ‘మహానాడు’ సందర్భంగా పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాలులో పోలీస్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారికి దిశానిర్దేశం చేశారు. పలువురు వీవీఐపీలు, వీఐపీలు, పెద్ద ఎత్తున ప్రజలు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పార్కింగ్ ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. అందరూ అప్రమత్తంగా ఉంటూ.. కేటాయించిన విధులు నిర్వర్తించాలన్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బందితో సమన్వయం చేసుకుని తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.