
ప్రొద్దుటూరులో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని పలు ప్రాంతాల్లో సోమవారం లీగల్ మెట్రాలజీ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ రమేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరిగాయి. చికెన్ దుకాణాలను పరిశీలించి మూడు కేసులు నమోదు చేశారు. అలాగే పాత బస్టాండ్, శివాలయం సెంటర్‌లోని పండ్ల వ్యాపారులు ఉపయోగిస్తున్న తక్కెడలను ఇన్‌స్పెక్టర్ పరిశీలించి సరిగా లేని వాటిని సీజ్ చేశారు. ఎరువులు, పురుగుమందుల దుకాణాల్లో తనిఖీ చేసి ఒక కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఉప్పరపల్లి పంట పొలాల్లో వరి కొనుగోలు కాటాను తనిఖీ చేయగా తూకంలో తేడాలు ఉండడంతో కేసు నమోదు చేశారు.
ఎరువులు అమ్మిన డబ్బు ప్రభుత్వానికి జమ చేయాలి
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా ఎరువులు విక్రయించగా వచ్చిన రూ. 32 లక్షల డబ్బు ప్రభుత్వానికి అందజేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బి.దస్తగిరిరెడ్డి కోరారు. సోమవారం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్‌కు వినతిపత్రం సమర్పించారు. రైతు సేవా కేంద్రాల నుంచి ఆ డబ్బులు వసూలు చేయడంలో మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. 2024–25లో జిల్లాలోని 75 రైతు సేవా కేంద్రాల్లో రూ. 3194 లక్షల బకాయిలు వసూలు చేయడంలో మార్క్‌ఫెడ్ మేనేజర్ పరిమళజ్యోతి విస్మరించడం శోచనీయమన్నారు. ఎరువులు కొనుగోలు చేసిన రైతులకు డిజిటల్ రూపంలో లావాదేవీలు నిర్వహించడంపై అవగాహన లేదన్నారు. దీన్ని ఆసరాగా తీసుకున్న రైతు సేవా కేంద్రాల సిబ్బంది నగదు రూపంలో, ఫోన్ పే రూపంలో వసూలు చేశారని తెలిపారు. ఆ డబ్బును రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉన్నప్పటికీ ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా జమచేయలేదని ఆరోపించారు.
మతం మారితే వ్యక్తి సామాజిక స్థితి మారదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే ఎస్సీ అర్హత కోల్పోతారని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు సరైంది కాదని ఏపీపీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మల్లెం విజయ భాస్కర్ అన్నారు. సోమవారం కడపలో ఆయన మాట్లాడుతూ అనేక కులాల వారు క్రైస్తవ మతం తీసుకున్నారని వారి కులం మారుతుందా అని ప్రశ్నించారు. ఏ కులంలో లేని విధంగా కేవలం ఒక ఎస్సీ కులానికే ఈ విధంగా తీర్పు ఇవ్వడం సరైంది కాదన్నారు. మతాన్ని సాకుగా చూపి ఎస్సీలకు అన్యాయం చేయ వద్దని కోరారు. దళిత క్రై స్తవులకు మత స్వేచ్ఛ, రక్షణ కల్పించాలని, క్రై స్తవులపై దాడులను అరికట్టాలని ప్రభు =త్వాన్ని కోరారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఎర్రగుంట్ల (జమ్మలమడుగు) : మండల పరిధిలోని నిడిజివ్వి సమీపంలో బైకు అదుపుతప్పి యువకుడు మృతి చెందాడు. సీఐ నరేష్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు ఇర్ఫాన్ బాషా(23) మహమ్మద్ ఆలీ, గౌస్‌బాషాలు కోగటం ఉరుసుకు వెళ్లారు. తిరిగి వెళుతున్న సమయంలో కదిరేవారిపల్లె సమీపంలో బైక్ అదుపు తప్పి కరెంటు స్తంభానికి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇర్ఫాన్ బాషా(23) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ప్రొద్దుటూరులో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు

ప్రొద్దుటూరులో లీగల్ మెట్రాలజీ అధికారుల తనిఖీలు