నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
● కడప హౌసింగ్‌బోర్డుకు చెందిన శివప్రసాద్ టిఫెన్ బంకు పెట్టుకొని తద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషిస్తున్నారు. టిఫెన్ సెంటర్ నిర్వాహణ ఖర్చులు పోనూ సరాసరిగా ప్రతిరోజు రూ.600 ఆదాయం గడిస్తున్నారు. ఈలెక్కన నెలకు రూ.18 వేలు ఆదాయం లభిస్తోంది. అద్దె ఇళ్లు బాడుగ రూ.5 వేలు, కరెంటు, గ్యాస్ ఖర్చులు రూ.2 వేలు, పిల్లల స్కూల్ ఫీజులు రూ.3 వేలు, నిత్యావసర వస్తువులు రూ.5వేలు, ఫోన్లు రీఛార్జీ, పెట్రోల్‌కు రూ.2వేలు ప్రతినెలా ఖర్చులు భరిస్తున్నారు. ఇటీవల నిత్యావసర వస్తువులు భారీగా పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు శివప్రసాద్ వాపోతున్నారు.
● అక్కాయపల్లెకు చెందిన రాము ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ప్రతిరోజు వెయ్యి రూపాయలు ఆటో నిర్వాహణ ద్వారా లభిస్తోంది. ఆటో బాడుగ రూ.250, డీజల్‌కు రూ.250 ఖర్చులు పోనూ సరాసరిగా నెలకు రూ.15వేలు ఆదాయం గడిస్తున్నారు. జగనన్న ఇళ్లు ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులు పెరగడంతో ఖర్చులకు సర్దుబాటు కష్టంగా మారిందని వాపోతున్నాడు. వేడినీళ్లకు చన్నీళ్లు తోడు అన్నట్లుగా వ్యక్తిగత ఆదాయానికి ప్రభుత్వ తోడ్పాటు ఉండేది. అర్హత ఉన్నా ఇప్పుడా అవకాశం కోల్పోయామని రాము వాపోతున్నాడు. అమ్మ ఒడి పథకం, వాహనమిత్ర, వైఎస్సార్ ఆసరా ఇలా ఏదో ఒక విధంగా లభించే సొమ్ముతో కుటుంబ పోషణ సజావుగా సాగేదని వివరిస్తున్నాడు.
సాక్షి ప్రతినిధి, కడప: గడిచిన మూన్నెళ్లుగా సామాన్యుల జీవనం భారంగా మారింది. కందిపప్పు కొండెక్కింది. కూరగాయలు ధరలు మండిపోతున్నాయి. వంటనూనెలు కాగిపోతున్నాయి. వచ్చే ఆదాయం కంటే ఖర్చులు అధికమయ్యాయి. ప్రభుత్వ పథకాలు ద్వారా లభిస్తోన్న ఆర్థిక భరోసా నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయి. వెరశి సామాన్యులు (పేదలు, మధ్యతరగతి) విలవిల లాడుతున్నారు.
ఆకాశాన్ని
అంటిన ధరలు...
కిలో కందిపప్పు కిలో రూ.173, ఎండుమిర్చి రూ.220, తెల్లగడ్డలు రూ.300, చింతపండు రూ.140 ఇలా నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి. పేద, మధ్యతరగతి జీవనశైలి భారంగా మరింది. పచ్చడి మెతుకులు తిందామన్నా ఉల్లిగడ్డ కన్నీళ్లు తెప్పిస్తోంది. వంట నూనెలు మండిపోతున్నాయి. వేరుశనగ నూనె ఏకంగా రూ.160 చేరింది. కూరగాయలు కిలో రూ.40 తక్కువ లేకుండా ఉండిపోయాయి. ఆకుకూరలు అగ్గి కురుస్తున్నాయి. నిత్యావసర ధరల నియంత్రణ లేదు. మార్కెట్‌లో దళారులదే రాజ్యమైంది. పండిస్తున్న రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోగా, రిటైల్ వ్యాపారులు భారీగా ఆర్జిస్తున్నారు.
కనుమరుగైన ప్రభుత్వ తోడ్పాటు...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కార్ సామాన్యులకు అండగా నిలిచింది. క్రమం తప్పకుండా ఆర్థిక తోడ్పాటు ఇచ్చేది. సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు చేర్చేది. తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు అదుపుతప్పినా సామాన్యుల జీవనం ఎలాంటి ఒడుదుడుకులు లేకుండా సాగేది. ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయింది. జూన్ నెలలో అమ్మ ఒడి పథకం, వైఎస్సార్ లా నేస్తం (మొదటి విడత), జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన (మొదటి విడత), వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సాహకాలు, జగనన్న తోడు (మొదటి విడత), వైఎస్సార్ సున్నా వడ్డీ (ఎస్‌హెచ్‌జీ), వైఎస్సార్ కళ్యాణమస్తు–షాదీతోఫా (రెండోత్రైమాసికం) ఆగష్టులో జగనన్న విద్యా దీవెన (రెండోవిడత), వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహనమిత్ర, సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత లభించేది. ఆయా పథకాల ద్వారా లక్షల మందికి నేరుగా లబ్ధి చేకూరేది. చంద్రబాబు సర్కార్ సంక్షేమాన్ని విస్మరించడంతో నిత్యావసర వస్తువులు ధరలు పెరగడంతో జీవనం భారంగా మారిందని విశ్లేషకులు వివరిస్తున్నారు.
:
:
:
:
:
:
:
భారంగా నిత్యావసర వస్తువులు
కొండెక్కిన కందిపప్పు
పులుపెక్కిన చింతపండు
కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
కాగుతున్న వంట నూనెలు
కందిపప్పు 173(కిలో) తెల్లగడ్డలు 300
శనిగపప్పు 100 ధనియాలు 120
పెసులు 130 అలసంద 110
మినుము 125 నువ్వులు 170
ఎండుమిర్చి 220 ఉల్లిగడ్డలు 60
చింతపండు 140 పామాయిల్ 95
వేరుశనగ సన్‌ఫ్లవర్
నూనె 160 ఆయిల్ 112
పెరిగిన ధరలతో ఇబ్బందులు...
నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయి. నేను టిఫిన్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాను. పెరిగిన ధరలతో ఇ బ్బందిగా ఉంది. – బి.రాజేష్, ఎంఎస్ టిఫిన్ సెంటర్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, కడప
ఇల్లు గడవడం కష్టం
నిత్యావసర సరుకులతో నిత్యం పని ఉంటుంది. ఈ సరుకుల ధరలు పెరగడం తో మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బందులకు గురవుతాయి. – సుబ్బమ్మ, లోహియానగర్, కడప
ధరలు తగ్గించాలి..
కేవలం నెల, రెండు నెలల కాలంలోనే ధరల పెరుగుదల కనిపిస్తోంది. పెరిగిన ధరలతో ఏం కొనాలన్నా భయమేస్తోంది. ధరలు తగ్గించాలి. – ముంజుల, ఎర్రముక్కపల్లె, కడప
ఏమీ కొనలేకున్నాం
పెరిగిన ధరల కారణంగా ఏ వస్తువును కొనలేని పరిస్థితి ఏర్పడింది. అన్ని రకాల సరుకుల ధరలు పెరిగాయి. ధరలు ఇలాగే ఉంటే ఏమీ కొనలేం...తినలేం. – పి.రోజా, కృపా కాలనీ, కడప
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)
నిత్యావసర వస్తువుల ధరలు (రూ.లలో)


