నార్కట్‌పల్లి : విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని కోరుతూ నార్కట్‌పల్లిలో సోమవారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు వ్యతిరేకంగా తెచ్చిన జీఓ నంబర్ 9, ఆర్‌ఆర్ యాక్ట్ ను రద్దు చేయాలన్నారు. ఫీజులను ప్రభుత్వమే భరించాలి, విద్యాశాఖ మంత్రిని నియమించి వెంటనే విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడకి చేరుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థి నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. పోలీసులు విద్యార్థులపై దాడి చేయడంతో విద్యార్థులు బస్సులపైకి ఎక్కి నినాదాలు చేశారు. అనంతరం శాంతియుతంగా ధర్నా చేశారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సతీష్, పల్లపు దుర్గయ్య, పాలకూరి రమేష్, డెక్కంటి గణేశ్, సిలువేరు నాగరాజు, పి సర్వయ్య గౌడ్, కారంపూడి సాయి తేజ, మహేష్, ఎడ్ల మహాలింగం, జినుకల కృష్ణ, సురేష్, మనీష్, అనిత, లింగస్వామి, వినయ్, వెంకట్, భాస్కర్, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


