భువనగిరి: తొలి ఏకాదశిని పురస్కరించుకుని భువనగిరి పట్టణంలోని స్వర్ణగిరి క్షేత్రంలో గల వేంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి లక్ష తులసి సహస్రనామార్చన నిర్వహించారు. తెల్లవారుజామున స్వామి వారికి సుప్రభాత సేవ అనంతరం మూలవిరాట్‌కు నవకలశ పంచామృతాభిషేకం జరిపించారు. పట్టువస్త్రాలు ధరింపజేసి పుష్పామాలతో అలంకరించారు. తోమాల సేవ, అనంతరం స్వామి వారికి నిత్య కల్యాణ మహోత్సవం నిర్వహించారు. సాయంత్రం తిరువీధి ఉత్సవ సేవ, రాత్రి జలనారాయణ స్వామికి మంగళహారతుల సమర్పన చేపట్టారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక దర్మకర్తలు మానేపల్లి రామారావు, ధర్మకర్తలు మానేపల్లి మురళీ, గోపి, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


