యాదగిరిగుట్ట : వానలు కురవాలని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి అనుబంధ దేవాలయమైన పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వరస్వామి ఆలయంలో చేపట్టిన వర్ష పాశుపత వరుణ యాగం బుధవారం మూడో రోజు కూడా కొనసాగుతుంది. ఈ సందర్భంఆ ఆలయ పూజారులు స్థాపిత దేవతా, రుష్యశృంగ, శివ, వరుణ జపం, విరాట పర్వ పారాయణం, వర్ష పాశుపత హవన పూర్వక పూర్వాంగ విధులు నిర్వహించారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్పటిక రామలింగేశ్వరుడికి అభిషేకం, శత రుద్రాభిషేం, బిల్వార్చన, నివేధన, నీరాజన మంత్ర పుష్పం పూజలు జరిపించారు. అనంతరం శివ అంతరాలయంలో జల దిగ్భంద చతుర్వేద పారాయణం చేపట్టారు.
స్వర్ణగిరీశుడికి
పాదపద్మార్చన సేవ
భువనగిరి : పట్టణ శివారులోని స్వర్ణగిరి క్షేత్రంలో వేంకటేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం 108 బంగారు అష్టదళ పుష్పాలతో స్వామివారికి అర్చకులు అష్టదళ పాదపద్మార్చన సేవ నిర్వహించారు. అంతకుముందు సుప్రభాత సేవ, సహస్రనామార్చన, నిత్య కల్యాణోత్సవం జరిపించారు. సాయంత్రం తిరువీది ఉత్సవ సేవ నిర్వహించారు. ఆయా పూజా కార్యక్రమాల్లో అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.


