అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వాడొద్దు | - | Sakshi
Sakshi News home page

అధిక శబ్దం చేసే సైలెన్సర్లు వాడొద్దు

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

సూర్యాపేట ఎస్పీ నరసింహ

కోదాడరూరల్‌ : ద్విచక్ర వాహనదారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం చేసే సైలెన్సర్లను తమ వాహనాలకు ఉపయోగిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని సూర్యాపేట ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. మంగళవారం కోదాడ పట్టణంలోని రంగా థియేటర్‌ సెంటర్‌లో చేపట్టిన స్పెషల్‌ డ్రైవ్‌లో పట్టుబడిన 40 మోడిఫైడ్‌ సైలెన్సర్లను పోలీసులు రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేయించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని మాట్లాడారు. అధిక శబ్ధం చేసే సైలెన్సర్లతో ద్విచక్రజు వాహనాలపై పట్టణంలో ఇష్టానుసారంగా తిరుగుతూ వృద్ధులు, చిన్నారులు, బాటసారులను భయబ్రాంతులకు కలిగించే వారిపై ప్రత్యేక నిఘా పెడతామన్నారు. ద్విచక్ర వాహనదారులు కంపెనీ సూచించిన సైలెన్సర్లు మాత్రమే వాడాలని, లేదంటే వాహనాలను సీజ్‌ చేసి జరిమానాలు విధిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, కోదాడ పట్టణ సీఐ కె.శివశంకర్‌, ట్రాఫిక్‌ ఎస్‌ఐ బైరెడ్డి అంజిరెడ్డితో పాటు పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విద్యుత్‌ మోటార్లు,

తీగలు చోరీ

నడిగూడెం : మండల కేంద్రం సమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వ కట్టపై నడిగూడెం, కృష్ణానగర్‌ గ్రామాలకు చెందిన రైతులు దున్నా వెంకన్న, సురగాని లింగయ్య, ఎలకా వెంకటరెడ్డి, జూకంటి అచ్చయ్యకు చెందిన ఐదు విద్యుత్‌ మోటార్లను సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. మంగళవారం ఉదయం రైతులు వెళ్లి చూసేసరికి మోటార్లు కనిపించలేదు. అదేవిధంగా నడిగూడెం ప్రభుత్వాస్పత్రి వెనుక పొలం కౌలు చేస్తున్న గుండు పాపయ్యకు చెందిన దాదాపు 200 మీటర్ల విద్యుత్‌ తీగలు కూడా చోరీకి గురయ్యాయి. బాధితులు మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement