యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు | - | Sakshi
Sakshi News home page

యాదగిరీశుడి సన్నిధిలో 2.15గంటలు

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

సీఎం పర్యటన సాగిందిలా..

యాదగిరిగుట్ట : టెంపుల్‌ సిటీపై వేద పాఠశాల నిర్మాణానికి, మరికొన్ని అభివృద్ధి పనులు శంకుస్థాపన చేయడానికి వచ్చిన సీఎం సుమారు 2 గంటల 15 నిమిషాల పాటు యాదగిరిగుట్టలో గడిపారు. సీఎం.. శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్‌లు ఉదయం 8.40 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌ ద్వారా గుట్టకు చేరుకున్నారు.

● 8.53 గంటలకు ప్రత్యేక కార్వన్‌ బస్సులోకి వెళ్లిన సీఎం సంప్రదాయ దుస్తులను ధరించి వచ్చారు.

● 9.26 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి స్వామీజీ ఆధ్వర్యంలో అర్చకులు, పారాయణీకులు, వేద పండితులు, పూజారుల సమక్షంలో వేద పాఠశాల భూమి పూజకు శ్రీకారం చుట్టారు.

● 9.40 గంటలకు వేద పాఠశాలకు శంకుస్థాపన భూమి పూజను పూర్తి చేశారు.

● 9.42 గంటలకు వేద పాఠశాల నిర్మాణం చేసే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నిత్య కల్యాణ మండపం, గోశాల, దీక్షాపరుల సన్నిధానం, వేద పాఠశాల నిర్మాణాలకు సంబంధించిన వాటితో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను ఆవిష్కరించారు.

● 10.03 గంటలకు యాదగిరీశుడి ఆలయంలోకి వెళ్లారు. త్రితల ద్వారం వద్ద ఆలయ అర్చకులు సీఎంకు పూర్ణ కుంభ స్వాగతం పలికారు.

● 10.10 గంటల నుంచి 10:21 గంటల వరకు గర్భాలయంలోని స్వయంభూలను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి వచ్చారు.

● 10.22 గంటలకు ముఖ మండపంలో సీఎంతో పాటు మంత్రులకు ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. అనంతరం దేవాదాయశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శైలజా రామయ్యర్‌, కమిషనర్‌ హనుమంతరావు, ఈవో భవానీ శంకర్‌, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తిలు శ్రీస్వామి వారి ప్రసాదం, జ్ఞాపికలను అందజేశారు.

● 10.32 గంటలకు పశ్చిమ ద్వారం నుంచి బయటకు వచ్చారు.

● 10.55 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు తిరిగి హైదరాబాద్‌కు వెళ్లారు.

Advertisement
 
Advertisement
Advertisement