ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలం

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

వలిగొండ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం విఫలమైందని క్రాంతిదళ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ పృథ్వీరాజ్‌ యాదవ్‌ విమర్శించారు. వలిగొండ మండలంలోని ఎదుల్లగూడెం, ఆర్రూరు, వేములకొండ గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఆయన తన బృందంతో కలిసిపరిశీలించారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు తమ పంటను అమ్ముకోవడానికి అరిగోస పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైస్‌ మిల్లుల యజమానులు తరుగు, తాలు పేరుతో క్వింటాకు 4 ,5 కిలోలు కటింగ్‌ రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్‌, సనత్‌ జయసూర్య, ఇన్జమూరి రాము, జక్కల మత్స్యగిరి, కొత్త నరసింహ, దుర్గం శంకర్‌, మనోహర్‌, కూకుట్ల లింగస్వామి, వెంకట్‌ రెడ్డి, గజ్జి ఐలయ్య, ప్రశాంత్‌, పోలేబోయిన మమత, లింగస్వామి, శ్రీనాథ్‌, చెగురి వంశీరాజ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement