అద్భుత పర్యాటక ప్రాంతంగా భువనగిరి ఖిలా | - | Sakshi
Sakshi News home page

అద్భుత పర్యాటక ప్రాంతంగా భువనగిరి ఖిలా

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

భువనగిరి: భువనగిరి ఖిలా అద్భుత పర్యాటక ప్రాంతంగా రూపుదిద్దుకుంటుందని పురావస్తు శాఖ డైరెక్టర్‌ కుతాడి అర్జున్‌రావు పేర్కొన్నారు. భువనగిరి ఖిల్లా పై కొనసాగుతున్న అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. అలనాటి రాచరికం ఉట్టిపడేలా ప్రతి కట్టడాన్ని నిర్మించాలన్నారు. భువనగిరి ఖిలా తిరిగి నాటి వైభవాన్ని తలపించేలా పనులు చేయాలని సూచించారు. అంతకు ముందు డంగు సున్నాన్ని పరిశీలించారు. నాణ్యత వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట వారసత్వ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ నాగరాజు, ఓఎస్‌డీ రాజు, పర్యాటక శాఖ డీఈ హనుమంతరెడ్డి, కాంట్రాక్టర్‌ రవీందర్‌, సిబ్బంది వినోద్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement