భువనగిరి(బీబీనగర్): అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలని సీ్త్ర శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజ కోరారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలోని 5,6 నంబర్ గల అంగన్‌వాడీ కేంద్రాలతో పాటు మండలంలోని రామునిగుండ్లతండాలో అంగన్‌వాడీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పిల్లలంకు అందించే ఆహారాన్ని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాలు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాయన్నారు. క్రమం తప్పకుండా కేంద్రాలకు వెళ్లి ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య పెంచేలా కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు కల్పిస్తున్న సదుపాయాలపై అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరసింహారావు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు. భువనగిరి పట్టణంలో నూతనంగా నిర్మిస్తున్న బాలసదన్, సఖి కేంద్రం భవనాలను ఆమె పరిశీలించారు.
ఫ సీ్త్రశిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శృతి ఓజ


