న్యాయవాదుల విధుల బహిష్కరణ | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదుల విధుల బహిష్కరణ

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

భువనగిరిటౌన్‌ : భువనగిరి అదనపు జిల్లా కోర్టును రామన్నపేటకు తరలించే నిర్ణయాన్ని నిరసిస్తూ బుధవారం న్యాయవాదులు విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు మాట్లాడుతూ కనీస సౌకర్యాలు లేని రామన్నపేటకు కోర్టును తరలిస్తే ప్రజలు అనేక ఇబ్బందులుపడతారన్నారు. ఈ విషయంలో హైకోర్టుకు వెళ్లి చీఫ్‌ జస్టిస్‌ను కలిసి విన్నవించుకుంటామని చెప్పారు. కోర్టును ఇక్కడే కొనసాగించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బార్‌అసోసియేషన్‌ అధ్యక్షుడు నిసంగి విద్యా సాగర్‌, మేడబోయిన యాదగిరి, శారద, బార్‌ సభ్యులు, సీనియర్‌ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement