వీర హనుమాన్ విజయయాత్రను జెండా ఊపి ప్రారంభిస్తున్న ఎస్పీ అక్షాంశ్‌యాదవ్
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాం
భువనగిరి : అర్హులందరికీ ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందజేస్తామని కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డులో గురువారం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి వంటి పథకాలతో పాటు నూతనంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ జీవిత బీమా, విద్యార్థులకు మధ్యాహ్న భోజన విస్తరణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. వార్డుల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ తంగేళ్లపల్లి శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్‌పర్సన్ మంజుల, కౌన్సిలర్ సుమయ్య తబస్సుమ్ , అధికారులు పాల్గొన్నారు.
ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్ చేసుకోవాలి
సాక్షి, యాదాద్రి: ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే ఇసుక బుకింగ్ చేసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో జిల్లాలో ఇసుక సరఫరా, వినియోగంపై ఎస్పీ అక్షాంశ్ యాదవ్, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి నిర్వహించిన సాండ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఇకనుంచి మాన్యువల్‌గా ఇసుకరవాణా చేయవద్దని ఆదేశించారు. ప్రభుత్వం గుర్తించిన ఇసుక రీచ్‌ల వద్ద నియమ నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు. సమావేశంలో భువనగిరి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజనల్ అధికారులు మాలి కృష్ణారెడ్డి, శేఖర్ రెడ్డి,, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి, మైనింగ్, ట్రాన్స్ పోర్ట్, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.


