మోత్కూరు నియోజకవర్గాన్ని సాధిద్దాం : ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

మోత్కూరు నియోజకవర్గాన్ని సాధిద్దాం : ఎమ్మెల్యే

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

మోత్కూరు : అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరు నియోజకవర్గ సాధన కోసం ఈ ప్రాంత బిడ్డగా ముందుంటానని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్‌ అన్నారు. గురువారం స్థానిక ఎల్‌ఎన్‌ గార్డెన్‌లో మోత్కూరు నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో గుండాల, మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు చెందిన అన్ని రాజకీయ పక్షాల నాయకులతో నిర్వహించిన సమావేశంలో సామేల్‌ మాట్లాడారు. మోత్కూరు నియోజకవర్గ సాధనకు రాజకీయాల కతీతంగా కృషి చేస్తానన్నారు. గతంలో నియోజకవర్గాల పునర్విభజనలో మోత్కూరు, అడ్డగూడూరు మండలాలు తుంగతుర్తి నియోజకవర్గంలో కలువగా ఆత్మకూరు(ఎం), గుండాల ఆలేరు నియోజకవర్గంలో కలిసి ఈ ప్రాంత అభివృద్ధి, అస్థిత్వం కొంత మేర దెబ్బ తిన్నదని అన్నారు. ఇకనైనా మోత్కూరు నియోజకవర్గం సాధించుకునేందుకు మంత్రులు, సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తన ఆధ్వర్యంలో తీసుకెళ్తానన్నారు. ఆయా రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయుల సంఘాల నాయకులు నియోజకవర్గ సాధనపై అభిప్రాయాలను వెల్లడించారు. సీనియర్‌ జర్నలిస్టు కాయితాల నర్సిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జిల్లా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి చేడె చంద్రయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మార్కెట్‌ చైర్మన్‌ నూనెముంతల విమలవెంకటేశ్వర్లు, మాజీ చైర్మన్‌లు మందడి రామకృష్ణారెడ్డి, చిప్పలపల్లి మహేంద్రనాథ్‌, బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్‌రెడ్డి, అడ్వకేట్‌ రహీం, తెలంగాణ ఉద్యమ గేయ రచయితలు అభినయ శ్రీనివాస్‌, కోదారి శ్రీనివాస్‌, అఖిలపక్షం నాయకులు పైళ్ల సోమిరెడ్డి, గుర్రం లక్ష్మీనర్సింహారెడ్డి, వంగాల సత్యనారాయణ, మర్రి అనిల్‌, గుజ్జ సోమనర్సయ్య, ఖలీల్‌, పొన్నబోయిన రమేష్‌, జంగ శ్రీను, గుండగోని రామచంద్రు, ఎన్‌.జోజి, ప్రభాకర్‌రెడ్డి, బుర్రు అనిల్‌, సత్యం గౌడ్‌, బుర్ర శ్రీనివాస్‌, బొట్టు అబ్బయ్య, చాడ మంజుల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement