ఫ ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌రెడ్డి
భువనగిరి : ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. 99రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం భువనగిరి పట్టణంలోని 22వ వార్డులో నిర్వహించిన సభలో మాట్లాడారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇచ్చిందన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో 60 మంది వైద్యులతో సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చామన్నారు. రూ.25 కోట్ల నిధులతో జిల్లా కేంద్ర ఆస్పత్రిని అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ తంగళ్లపల్లి శ్రీవాణిరవికుమార్, పోతంశెట్టి మంజులవెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవెజ్ చిస్తీ, వార్డు సభ్యుడు జాలిగం విఘ్నేష్, నాయకులు పోత్నక్ ప్రమోద్‌కుమార్, జహంగీర్, ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ నరేష్‌రెడ్డి, వార్డు సభ్యులు పూజిత, సూదగాని సరిత పాల్గొన్నారు.
కొలనుపాకలో జైన మహావీరుడి రథోత్సవం
ఆలేరురూరల్ : ఆలేరు మండలం కొలనుపాకలో గల శ్వేతాంబర జైన దేవాలయంలో పౌర్ణమి సందర్భంగా గురువారం రథోత్సవం నిర్వహించారు. జైన పూజారులు వర్ధమాన మహావీరుడితో పాటు 23 మంది జైన తీర్థంకరులకు పూజలు చేశారు. వర్ధమాన మహావీరుడి ప్రతిమను అలంకరించిన రథంలో ఉంచి జైన దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. తులసి తోటలో ముగింపు పూజ జరిపారు. పలుప్రాంతాల జైనులు ఆలయానికి వచ్చి పూజలు చేసి రథోత్సవంలో పాల్గొన్నారు.


