మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం

Apr 3 2026 7:02 AM | Updated on Apr 3 2026 7:02 AM

ఆత్మకూరు(ఎం): రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య అన్నారు. గురువారం ఆత్మకూర్‌(ఎం) మండలంలోని సింగారం, సర్వేపల్లి, మొరిపిరాల, మొదుగుకుంట, కాల్వపల్లి, రాయిపల్లి, ఉప్పలపహడ్‌ గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభించారు. సర్వేపల్లిలో మహిళా సంఘం భవనాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా బలపడడానికి ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను అందజేస్తున్నట్లు చెప్పారు. మహిళలు ప్రతి నెలా సమావేశాలు నిర్వహించుకోవడానికి జిల్లాకు 187 మహిళా సంఘం భవనాలు మంజూరు కాగా అందులో ఆలేరు నియోజక వర్గానికే 100 మంజూరు అయినట్లు చెప్పారు. రాష్ట్రంలోనే పూర్తి చేసుకున్న తొలి మహిళా సంఘ భవనం సర్వేపల్లిలో ప్రారంభిస్తున్నందుకు గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, ఎంపీడీఓ జె. రాములు నాయక్‌, మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి రచ్చ పల్లవి, ఏపీఎం గోదాసు నర్సింహ, పీఆర్‌ ఏఈ సుధాకర్‌, సర్పంచ్‌లు కల్వకుంట్ల ఉపేందర్‌రెడ్డి, పన్నాల వనజ, అంబోజు ధనమ్మ, సోలిపురం ఎల్లారెడ్డి, ఇంద్రాల భిక్షపతి, చిన్న బీరప్ప పాల్గొన్నారు.

ఫ ప్రభుత్వ విప్‌ బీర్ల ఐలయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement