తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తాటిచెట్టుపై నుంచి పడి గీతకార్మికుడు మృతి

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

మఠంపల్లి : మఠంపల్లి మండలం వరదాపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు వల్లపుదాసు చినహుస్సేన్‌గౌడ్‌(55) సోమవారం సాయంత్రం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా జారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని హుజూర్‌నగర్‌ ఆస్పత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ మృతిచెందాడు.

టిప్పర్‌ను ఢీకొట్టిన లారీ.. డ్రైవర్‌ మృతి

మృతుడు భువనగిరి జిల్లావాసి

దామెర : రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతిచెందాడు. ఈ ఘటన హనుమకొండ జిల్లా దామెర పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై కొంక అశోక్‌ కథనం ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా గొల్లపల్లికి చెందిన అవిశెట్టి శ్రీశైలం (26) ఇసుక కోసం సోమవారం తెల్లవారుజామున లారీతో ఏటూరునాగారం వెళ్తున్నాడు. ఈ క్రమంలో దామెర మండలం ఒగ్లాపూర్‌ సమీపంలో జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న టిప్పర్‌ డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో టిప్పర్‌ వెనుక భాగాన్ని లారీ బలంగా ఢీకొట్టింది. దీంతో డ్రైవర్‌ శ్రీశైలం తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి మామ ఫిర్యాదు మేరకు టిప్పర్‌ డ్రైవర్‌ వన్నాల రామకృష్ణపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement