ఈ వ్యవహారంపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితుల నుంచి వస్తున్న ప్రతి ఫిర్యాదుతో పాటు ఆరోపణలపై సమగ్రంగా విచారిస్తున్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత దోషులు ఎవరైనా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
భువనగిరి : భువనగిరిలోని కెనరా బ్యాంక్ కేంద్రంగా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ రుణాల దుర్వినియోగంపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ఉన్నతాధికారులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ బృందం బ్యాంకులోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.
పోలీస్ స్టేషన్‌లో విచారణ
ఈ కుంభకోణంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు రిసోర్స్ పర్సన్(ఆర్పీ)లను మంగళవారం భువనగిరి పట్టణ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు విచారించారు. ఈ విచారణలో కెనరా బ్యాంక్ మేనేజర్, ఫీల్డ్ ఆఫీసర్ కూడా పాల్గొన్నారు. వారి సమక్షంలోనే ఆర్పీలను ప్రశ్నించి, రుణాలు ఎక్కడికి వెళ్లాయి? ఈ అక్రమాల్లో ఇంకెవరి ప్రమేయం ఉందనే విషయాలను రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించారు.
అసలేం జరిగిందంటే..
భువనగిరి పట్టణంలో సుమారు 1,100 పైగా మహిళా సంఘాలు ఉన్నాయి. వీరు పట్టణంలోని వివిధ బ్యాంకులో పొదుపు డబ్బులు జమ చేస్తూ ఉంటారు. వీటిలో కెనారా బ్యాంకులో 200 సంఘాల ఖాతాలు ఉన్నాయి. ఈ బ్యాంకు నుంచి 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు 30 సంఘాలకు సుమారు రూ.4.50 కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలను ఇచ్చింది. తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించడం లేదని 30 మహిళా సంఘాలకు చెందిన 60 మంది లీడర్లుకు అధికారులు నోటీసులు పంపించారు. దీంతో తాము తీసుకోని రుణాలను ఎలా చెల్లిస్తాంటూ కొంత మంది లీడర్లు, సభ్యులు మెప్మా, పట్టణ పోలీసులో ఫిర్యాదులు చేశారు. దీంతో మున్సిపల్, మెప్మా అధికారులు విచారణకు ఆదేశించారు.
ఫ వాస్తవాలను నిగ్గుతేల్చేందుకు ప్రత్యేక బృందం
ఫ భువనగిరిలోని కెనరా బ్యాంకులో క్షుణ్ణంగా రికార్డుల పరిశీలన
ఫ ముగ్గురు ఆర్పీలను విచారించిన పోలీసులు


