పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

పార్టీల ప్రతినిధులు సహకారం అందించాలి

Apr 1 2026 7:18 AM | Updated on Apr 1 2026 7:18 AM

సాక్షి, యాదాద్రి : స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి కోరారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్రక్రియపై మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్‌లో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకా రెడ్డి తో పాటు గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ ప్రక్రియను పారదర్శకంగా, కచ్చితంగా పూర్తిచేయడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు బూత్‌ లెవెల్‌ ఏజెంట్ల జాబితాలను వెంటనే సమర్పించాలన్నారు. క్షేత్రస్థాయిలో బూత్‌ లెవెల్‌ అధికారులు మ్యాపింగ్‌ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీల సహకారం ఎంతో అవసరమన్నారు. త్వరలో నిర్వహించబోయే ఎస్‌ఐఆర్‌పై పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా.. బూత్‌ లెవల్‌ ఆఫీసర్లు వారి పరిధిలో గల బూత్‌ లలో ప్రతి ఇంటింటికి వెళ్లి జత ఎన్యూమరేటర్‌ ఫారం తీసుకువచ్చి ప్రతి ఓటరు వివరాలు అడిగి తెలుసుకుని వాటిని తగు సమాచారంతో నింపి, ఒక ప్రతిని వారి తీసుకొని, మరొక ప్రతిని ఓటరుకు అందజేస్తారన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల విభాగం సూపరింటెండెట్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

రేపటి నుంచి గ్రామసభలు నిర్వహిస్తాం

ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈనెల 2 నుంచి గ్రామ, వార్డు సభలు నిర్వహిస్తామని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంగళవారం హైదరాబాద్‌ ప్రజాభవన్‌ నుంచి కలెక్టర్లతో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో కలెక్టరేట్‌లో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు. ఇందులో ప్రజాప్రతినిధులతో పాటు ప్రజలను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు భాస్కర్‌రావు, వెంకారెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొన్నారు.

ఫ కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement