రోడ్డు ప్రమాదంలో రికార్డు అసిస్టెంట్ మృతి
మద్దిరాల : మండల కేంద్రంలోని సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వ్యక్తి మృతిచెందాడు. బుధవారం స్థానిక ఎస్‌ఐ ఎం. వీరన్న తెలిపిన వివరాల ప్రకారం.. మద్దిరాల తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మచ్కురి రాజేష్( 22) మంగళవారం రాత్రి ద్విచక్ర వాహనంపై సూర్యాపేట–దంతాలపల్లి ప్రధాన రహదారి మీదుగా కుంటపల్లి నుంచి మద్దిరాల వైపు వస్తుండగా.. మద్దిరాల శివారులో ఎదురుగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజేష్ ఎడమ కాలుకు, తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. బుధవారం మృతుడి తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. తుంగతుర్తి ఏరియా ఆస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. రాజేష్ భౌతికకాయానికి ఆర్డీఓ వేణుమాధవరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అతడి కుటుంబానికి రూ.30వేల ఆర్థికసాయం అందజేశారు.


