విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

Jan 22 2026 8:37 AM | Updated on Jan 22 2026 8:37 AM

విహార

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

విద్యార్థులను చూడగానే రోదించిన తల్లిదండ్రులు

డిండి : డిండి ఆదర్శ పాఠశాల విద్యార్థులు ఏపీలో విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తుండగా.. ఏపీలోని రాజమండ్రి సమీపంలో మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 20 మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్‌కు గాయాలయ్యాయి. వివరాలు.. డిండి మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 9, 10వ తరగతి, ఇంటర్మీడియట్‌ చదువుతున్న 110 మంది విద్యార్థులు, 10 మంది ఉపాధ్యాయులు ఈ నెల 17న రెండు బస్సుల్లో విహారయాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. అక్కడ అరకు, బొర్రా గుహలు, వైజాగ్‌ బీచ్‌తో పాటు సింహచలం, అన్నవర పుణ్యక్షేతాలను దర్శించుకుని మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. అర్ధరాత్రి తర్వాత తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైపు వస్తుండగా.. దివాన్‌ చెరువు సమీపంలోకి రాగానే బాలురతో వస్తున్న బస్సుకు ఆవు అడ్డురావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేశారు. దాని వెనుకనే వస్తున్న రెండు ట్రావెల్స్‌ బస్సులు, బాలికల బస్సు ఒకదానికొకటి వరుసగా ఢీకొన్నాయి. దీంతో బాలికల బస్సులో ఉన్న దాదాపు 20 మంది విద్యార్థినులకు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్‌ నారాయణరెడ్డికి గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. మిగిలిన విద్యార్థులను దివాన్‌చెరువులోని బాలవికాస్‌ మందిరానికి తరలించారు.

నల్లగొండ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు..

రాత్రంతా దివాన్‌ చెరువు సమీపంలోని బాలవికాస్‌ మందిరంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు విశ్రాంతి తీసుకున్నారు. వీరు వెళ్లిన రెండు బస్సుల్లో ఒకటి ధ్వంసం కాగా.. ఇంకొక బస్సుతో పాటు మరో బస్సును మాట్లాడుకొని బుధవారం ఉదయం డిండికి బయల్దేరారు. ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు 24 మంది విద్యార్థులను నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. ఎటువంటి ప్రమాదం లేకపోవడంతో డీఈఓ భిక్షపతికి అప్పగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ నర్సింహారావు నేత చెప్పారు.

దేవరకొండ ఎమ్మెల్యే పరామర్శ

విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే బాలూనాయక్‌, డీఈఓ భిక్షపతి ప్రిన్సిపాల్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద ఘటనపై ఆరాతీసి ఆందోళనకు గురైన పలువురు విద్యార్థుల తల్లిదండ్రులకు వారు ధైర్యం చెప్పారు.

ఫ ఒకదానికొకటి ఢీకొన్న

నాలుగు ప్రైవేట్‌ బస్సులు

ఫ డిండి ఆదర్శ పాఠశాలకు చెందిన 20మంది విద్యార్థులు, ఇద్దరు టీచర్లు, ప్రిన్సిపాల్‌కు గాయాలు

ఫ ఏపీలోని రాజమండ్రి వద్ద ఘటన

ఫ డిండికి తిరిగి వచ్చిన విద్యార్థులు

బుధవారం రాత్రి 10 గంటల సమయంలో బాలుర బస్సు, 11.15 గంటలకు బా లికల బస్సు డిండి ఆదర్శ పాఠశాలకు చేరుకోగా.. వారిని చూసి తల్లిదండ్రులు రోదించారు. తమ పిల్లలు స్వల్ప గాయాలతో బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం1
1/4

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం2
2/4

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం3
3/4

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం4
4/4

విహారయాత్రకు వెళ్లొస్తుండగా ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement