జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక
బొమ్మలరామారం : తెలంగాణ షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా తాండూరులో ఈ నెల 18న జరిగిన సెలక్షన్స్‌లో బొమ్మలరామారం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు పాల్గొని 5వ జాతీయ స్థాయి సౌత్ జోన్ పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు బి. నర్సింహ సోమవారం తెలిపారు. సబ్ జూనియర్ బాలికల విభాగంలో తుమ్మల కావ్యశ్రీ, డేతాల వైష్ణవి, బేతాల దేవిభవాని, బాలికల జూనియర్స్ విభాగంలో మల్లెబోయిన నిఖిత, సీనియర్స్ విభాగంలో బేతాల కావ్యశ్రీ, మాలి రాధిక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో జరగనున్న జాతీయ స్థాయి పోటీల్లో వీరు పాల్గొననున్నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల హెచ్‌ఎం వరలక్ష్మి, గ్రామ సర్పంచ్ కట్ట ఉమాదేవిశ్రీకాంత్‌గౌడ్‌్, ఉప సర్పంచ్ ఎల్లబోయిన జంగయ్య, స్కూల్ కమిటీ చైర్మన్ హేమలత, షూటింగ్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోత్కూరు యాదయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి మానస అభినందించారు.
కరాటే ఏ గ్రేడ్ జడ్జిలుగా
సూర్యాపేట వాసులు
సూర్యాపేట అర్బన్ : కరాటే ఇండియా ఆర్గనైజేషన్(కియో) రాష్ట్రస్థాయి ఏ గ్రేడ్ జడ్జిలుగా సూర్యాపేట పట్టణానికి చెందిన సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ సీనియర్ కరాటే మాస్టర్ జేవీ రమణ(చిన్న), ఆర్. సంతోష్ అర్హత సాధించారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన కియో, రెఫ్రీ, జడ్జి పరీక్షల్లో జేవీ రమణ, సంతోష్ పాల్గొని ఏ గ్రేడ్ జడ్జిలుగా అర్హత సాధించారు. కియో రాష్ట్ర సెక్రటరీ మళయాల రామస్వామి, కోశాధికారి మల్లికార్జున్, సుమన్ షోటోఖాన్ స్పోర్ట్స్ కరాటే డూ అకాడమీ ఫౌండర్ జె. శ్రీనివాస్ చేతుల మీదుగా వారు అర్హత పత్రాలను అందుకున్నారు. అర్హత సాధించిన కరాటే మాస్టర్లను కియో రాష్ట్ర అధ్యక్షుడు, టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేష్‌కుమార్‌గౌడ్, సినీ హీరో సుమన్ అభినందించారు.
జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపిక


