స్వతంత్రులకు 75 గుర్తులు
భువనగిరిటౌన్ : రెండు రోజుల్లో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకానున్న నేపథ్యంలో పోటీలో నిలిచే స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తులను విడుదల చేస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలను టీపోల్ వెబ్‌పైట్‌లో అప్లోడ్ చేశారు. దీంతో పాటు రిజర్వేషన్ సైతం ప్రకటించారు. జాతీయ, రాష్ట్ర, రిజిస్టర్ పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులకు ఆయా పార్టీల గుర్తింపు సింబల్స్ కేటాయిస్తారు. స్వతంత్రులుగా బరిలో నిలిచేవారికి గుర్తులు కీలకంగా మారుతాయి. ఎన్నికల సంఘం ఐదు జాతీయ పార్టీలు, నాలుగు రాష్ట్ర పార్టీలు, మరో నాలుగు రిజిస్టర్ పార్టీల గుర్తులతో పాటు స్వతంత్ర అభ్యర్థుల కోసం 75 గుర్తులను వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణ తర్వాత బరిలో ఉన్న అభ్యర్థులకు పార్టీలు ఇచ్చిన బీఫామ్ ప్రకారం గుర్తింపు పార్టీల గుర్తులు కేటాయిస్తే.. స్వతంత్రులుగా ఉన్నవారికి అక్షర క్రమంలో గుర్తులు కేటాయిస్తారు.
స్వతంత్రులకు గుర్తుల టెన్షన్
ఎన్నికల కమిషన్ వెల్లడించిన గుర్తులు స్వతంత్ర అభ్యర్థుల్లో టెన్షనన్ పుట్టిస్తున్నాయి. ఓటర్లు గుర్తుపట్టలేని విధంగా కొన్ని గుర్తులు కూడా ఉండడంతో పార్టీ గుర్తుల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. జాతీయ పార్టీలైన ఆమ్ ఆద్మీ పార్టీకి చీపురు, బీఎస్పీకి ఏనుగు, బీజేపీకి కమలం, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కి నిచ్చెన, సీపీఎంకు సుత్తి కొడవలి నక్షత్రం, కాంగ్రెస్‌కు చెయ్యి గుర్తులు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్రీయ పార్టీలైన ఏఐఎంఐఎంకు గాలిపటం, బీఆర్‌ఎస్‌కు కారు, టీడీపీకి సైకిల్, వైఎస్సార్‌సీపీకి ఫ్యాన్ గుర్తులు ఉండగా.. రిజిస్టర్ అయి ఇతర రాష్ట్రాల్లోని పార్టీలైన ఫార్వర్డ్ బ్లాక్‌కు సింహం, సీపీఐకి కంకి కొడవలి, జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తులు ఉన్నాయి.
మిగతా గుర్తులు ఇవీ..
స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించే గుర్తుల్లో ఎయిర్ కండిషనర్, యాపిల్, గాజులు, పండ్లబుట్ట, బ్యాట్, బ్యాటరీ టార్చ్, బైనాక్యులర్, సీసా, బ్రెడ్, బకెట్, కెమెరా, క్యారంబోర్డ్, చెయ్యిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, మంచం, కప్పు, సాసర్, కటింగ్ ప్లేయర్, డ్రిల్లింగ్ మెషిన్, డంబెల్స్, విద్యుత్ స్తంభం, ఎన్వలప్ కవర్, పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్, ఫుట్‌బాల్ ఆటగాడు, గౌను, గరాటా, గ్యాస్ సిలిండర్, గ్యాస్‌పొయ్యి, గ్రామ్‌ఫోన్‌్, ద్రాక్ష పండ్లు, పచ్చిమిరపకాయ, తోపుడు బండి, హెడ్‌ఫోన్, హాకీ కర్ర–బంతి, పనసపండు, బెండకాయ, పోస్ట్‌డబ్బా, గొళ్లెం, లూడో, అగ్గిపెట్టె, మైక్, మూకుడు, ప్యాంట్, పెన్ డ్రైవ్, అనాసపండు, కుండ, ప్రెషర్ కుక్కర్, రిఫ్రిజిరేటర్, ఉంగరం, సేఫ్టీపిన్, కుట్టు మిషన్, కత్తెర, నౌక, సితార్, సాక్స్, సోఫా, స్పానర్, స్టెతస్కోప్, స్టూల్, స్విచ్‌బోర్డ్, టేబుల్, టెలిఫోన్, టూత్‌బ్రష్, ట్రంపెట్, టైర్స్, వయోలిన్, వాల్‌నట్, వాటర్‌మిలాన్, బావి, ఈల, ఊలు–సూది గుర్తులు ఖరారు చేశారు. ఇందులో చాలా గుర్తులు ఓటర్లను ఆకట్టుకోవడానికి, ప్రచారం చేయడం కష్టంగానే ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పార్టీ గుర్తులే మేలు..
టికెట్లు ఆశిస్తున్నవారు ప్రధాన పార్టీల గుర్తులు ఉంటేనే గెలుపునకు తోడవుతుందని భావిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీల్లో టికెట్లు లభించని పక్షంలో రిజిస్టర్ పార్టీల నుంచి బరిలో నిలవాలనే ఆలోచనల్లో ఆశావహులు ఉన్నారు. ఏ క్షణమైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉండడంతో ముఖ్య నేతలు తమ ప్రాబల్యాన్ని చాటుకునే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఎన్నికల సంఘం గుర్తులు కూడా ఖరారు చేయడంతో పార్టీ టికెట్ లభించని వారు రెబల్స్‌గా బరిలో దిగితే వచ్చే గుర్తులపై సర్వత్రా చర్చ కొనసాగుతోంది.
విడుదల చేసిన ఎన్నికల సంఘం
మున్సిపాలీటీల్లో ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో గుర్తుల పైనే చర్చ


