సూర్యాపేట వాసికి ఇండియా ఫార్మా అవార్డు
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన ప్రముఖ సైంటిస్ట్, పారిశ్రామికవేత్త డాక్టర్ అనంతుల రవిశేఖర్ నేషనల్ ఇండియా ఫార్మా అవార్డు అందుకున్నారు. శాస్త్రవేత్తగా తాను చేసిన ప్రయోగాత్మక సేవలకుగాను ఢిల్లో జరిగిన ఫార్మా క్వాలిటీ ఎక్స్‌లెన్స్ అవార్డు ప్రదానోత్సవంలో సీపీహెచ్‌ఐ ఆర్గనైజింగ్ వారు ఈ పురస్కారం అందించినట్లు ఆయన తెలిపారు.
బాల రచయితల సమ్మేళనానికి ఎంపిక
కోదాడ : కోదాడ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న సోమ రమేష్ ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఈ నెల 30న ఆన్‌లైన్‌లో ‘బాల సాహిత్య భేరి’ పేరుతో నిర్వహిస్తున్న అంతర్జాతీయ బాల రచయితల సమ్మేళనానికి ఎంపికయ్యాడు. కథ, వచన కవిత్వం, గేయం, పద్యం విభాగాల్లో ప్రపంచ వ్యాప్తంగా 101 మంది విద్యార్థులకు తానా సంఘం అవకాశం ఇవ్వగా కోదాడకు చెందిన విద్యార్థి సోమ రమేష్ ఆ జాబితాలో ఉన్నాడు. గురువారం పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థిని మండల విద్యాధికారి సలీంషరీఫ్, ఉపాధ్యాయులు ప్రత్యేకంగా అభినందించారు.
సూర్యాపేట వాసికి ఇండియా ఫార్మా అవార్డు


