కాంగ్రెస్‌ జెండా దిమ్మెలు ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలు ధ్వంసం

Nov 28 2025 11:51 AM | Updated on Nov 28 2025 11:51 AM

కాంగ్

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలు ధ్వంసం

చౌటుప్పల్‌ రూరల్‌ : గ్రామాల్లో సర్పంచ్‌ ఎన్నికల హడావుడి కొనసాగుతున్న వేళ బుధవారం రాత్రి చౌటుప్పల్‌ మండలంలోని దండుమల్కాపురం, తూప్రాన్‌పేట గ్రామాల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాంగ్రెస్‌ జెండా దిమ్మెలను ధ్వంసం చేయడం కలకలం రేపింది. జెండా దిమ్మెలను ధ్వంసం చేయడంలో తెలంగాణ జాగృతి కార్యకర్తల పాత్ర ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిలో జాగృతి రాష్ట్ర అధ్యక్షుడితో పాటు మరో నలుగురు ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. జాగృతి ఎల్బీనగర్‌ జోన్‌ అధ్యక్షుడిగా ఉన్న మన్సురాబాద్‌కు చెందిన రాంకోటిని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మరో నలుగురిలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఇద్దరు, హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌కు చెందిన మరో ఇద్దరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చౌటుప్పల్‌ సీఐ మన్మథకుమార్‌ తెలిపారు. సర్పంచ్‌ ఎన్నికల వేళ సంచలనం సృష్టించడానికే ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు పోలీసుల అదుపులో ఉన్న రాంకోటి చెప్పినట్లు ఓ పోలీస్‌ అధికారి పేర్కొన్నారు.

భారీగా తరలివచ్చిన కాంగ్రెస్‌ శ్రేణులు..

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలను జాగృతి కార్యకర్తలు ధ్వంసం చేసినట్లు తెలుసుకున్న కాంగ్రెస్‌ నాయకులు గురువారం దండుమల్కాపురం, తూప్రాన్‌పేట గ్రామాలకు భారీగా తరలివచ్చారు. కూల్చిన జెండా దిమ్మెలను పరిశీలించారు. జెండా దిమ్మెలను ధ్వంసం చేయడం పిరికపంద చర్య అని, దిమ్మెలను ధ్వంసం చేసిన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ మునుగోడు నియోజకవర్గ ఇన్‌చార్జి పబ్బు రాజుగౌడ్‌, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ వెన్‌రెడ్డి రాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ వైస్‌ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మండల అధ్యక్షులు బోయ దేవేందర్‌, మున్సిపాలిటీ అధ్యక్షులు సుర్వి నర్సింహ తదితరులు జెండా దిమ్మెలను పరిశీలించిన వారిలో ఉన్నారు.

పోలీసులకు ఫిర్యాదు

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలను ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ నాయకులు చౌటుప్పల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఎస్‌ఐ కె. ఉపేందర్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మన్మథకుమార్‌ తెలిపారు.

దండుమల్కాపురం,

తూప్రాన్‌పేటలో ఘటనలు

పోలీసుల అదుపులో ఒకరు

పోలీసులకు ఫిర్యాదు చేసిన

కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలు ధ్వంసం1
1/1

కాంగ్రెస్‌ జెండా దిమ్మెలు ధ్వంసం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement