డివైడర్‌ను ఢీకొని యువకుడికి గాయాలు
చివ్వెంల(సూర్యాపేట) : బైక్‌పై వెళ్తున్న యువకుడు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చివ్వెంల మండలం గుంపుల గ్రామ శివారులో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం దోసపహాడ్ గ్రామానికి చెందిన కడవంచి సతీష్ చివ్వెంల మండలం గుంపుల గ్రామంలో వరికోత మిషన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం స్వగ్రామంలో శుభకార్యం ఉండటంతో బైక్‌పై వెళ్లి తిరిగి గుంపుల గ్రామానికి వస్తుండగా.. గ్రామ శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సతీష్ ఎడమ కాలు విరిగింది. చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానికులు చికిత్స నిమిత్తం సూర్యాపేట జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
డివైడర్‌ను ఢీకొని యువకుడికి గాయాలు


