ధాన్యం లారీ బోల్తా
నూతనకల్: మండల కేంద్రంలో గురువారం తెల్లవారు జామున ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. స్థానికులు, లారీ డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా లక్సెట్‌పల్లి నుంచి ధాన్యాన్ని లారీలో మిర్యాలగూడ రైస్ మిల్లుకు తరలిస్తున్న క్రమంలో నూతనకల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అకస్మాత్తుగా వ్యక్తి రోడ్డుపైకి రావడంతో లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో లారీ మెయిన్ క్రాంక్ విరిగి అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.


