మూసీలో గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం
నేరేడుచర్ల: నేరేడుచర్ల మండలం బురుగులతండా సమీపంలో శనివారం మూసీ నదిలో గల్లంతైన సోమారం గ్రామానికి చెందిన కొమరాజు సుస్మిత(13) మృతదేహం ఆదివారం లభ్యమైంది. సుస్మిత సోమారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది. శనివారం సరదాగా తన స్నేహితులతో కలిసి తయారుచేసిన మట్టి గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు బురుగులతండా శివారులోని సోమప్ప దేవాలయం సమీపంలో మూసీ నది వద్దకు వెళ్లింది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతయ్యింది. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ రవీందర్‌నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ టీం సహాయంతో బాలిక ఆచూకీ కోసం గాలించగా.. ఆదివారం బురుగులతండా వద్ద మూసీ నదిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
వినాయకుడిని నిమజ్జనం
చేసేందుకు వెళ్లి మృత్యువాత
వరద నీటికి ఎదురెళ్లి నదిలో నుంచి
మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చిన ఎస్‌ఐ


