ఎస్‌ఐ ఈదుకుంటూ వెళ్లి..
వరద ప్రహావానికి బాలిక మృతదేహం అవతలి ఒడ్డుకు కొట్టుకుపోగా.. నేరేడుచర్ల ఎస్‌ఐ రవీందర్‌నాయక్ స్వయంగా అవతలి ఒడ్డు నుంచి నదిలో ఈదుకుంటూ వరద నీటికి ఎదురు వెళ్లి బాలిక మృతదేహాన్ని తెప్ప మీద ఉంచి తాడుతో బయటకు తీసుకొచ్చారు. ఎస్‌ఐ ధైర్య సాహసాలను పలువురు ప్రశంసించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజూర్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సుస్మిత మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.


