నల్లబెల్లం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నల్లబెల్లం పట్టివేత

Nov 10 2025 7:58 AM | Updated on Nov 10 2025 7:58 AM

నల్లబ

నల్లబెల్లం పట్టివేత

సాగర్‌ కాలువలో పడి లారీ డ్రైవర్‌..

భువనగిరిటౌన్‌ : ఏపీలోని చిత్తూరు నుంచి మహబూబాబాద్‌కు బొలేరో వాహనంలో అక్రమంగా నల్లబెల్లం తరలిస్తున్న ముగ్గురిని నల్లగొండ ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం ఆదివారం ఉదయం భువనగిరి పట్టణంలో పట్టుకున్నారు. వారి నుంచి నాటుసారా తయారీకి ఉపయోగించే 1600 కేజీల నల్ల బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు ఎకై ్సజ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె. రవిచంద్రారెడ్డి తెలిపారు. పట్టుడిన బానోత్‌ సాయికిరణ్‌, ఎండీ బషీర్‌, భూక్య అఖిల్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈతకు వెళ్లి కృష్ణా నదిలో

యువకుడి గల్లంతు

హుజూర్‌నగర్‌, మేళ్లచెరువు: ఈతకు వెళ్లి కృష్ణా నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు వద్ద ఆదివారం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. హుజూర్‌నగర్‌ మండలం లింగగిరి గ్రామానికి చెందిన ఎస్‌కే ముజీబ్‌, నాగుల్‌మీరా, మరో నలుగురు స్నేహితులు కలిసి పులిచింతల ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. ప్రాజెక్టు దిగువన ఏపీలోని పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు వైపు పుష్కరఘాట్‌ వద్ద ఈత కొట్టేందుకు ముజీబ్‌, నాగుల్‌మీరా కృష్ణా నదిలోకి దిగగా.. నీటి ప్రవాహానికి వారు కొట్టుకుపోయారు. మిగతా వారు కేకలు వేయడంతో స్థానిక మత్స్యకారులు గమనించి నాగుల్‌మీరాను కాపాడారు. ముజీబ్‌ నీటిలో మునిగి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న చింతలపాలెం పోలీసులు, హుజూర్‌నగర్‌, కోదాడ ఫైర్‌ సిబ్బంది ఘటనా స్ధలానికి చేరుకుని గాలింపు చర్యలు ప్రారంభించారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు కష్టంగా మారాయి.

గరిడేపల్లి: గరిడేపల్లి మండలం మర్రికుంట గ్రామ సమీపంలోని సాగర్‌ ఎడమ కాల్వలో పడి లారీ డ్రైవర్‌ గల్లంతయ్యాడు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌కు చెందిన లారీ డ్రైవర్‌ ఈట శ్రీకాంత్‌(36) చైన్నె నుంచి కెమికల్‌ బ్యాగ్స్‌ లోడుతో మంచిర్యాలకు వెళ్తున్నాడు. మార్గమధ్యలో ఆదివారం మధ్యాహ్నం గరిడేపల్లి మండలం మర్రికుంట సమీపంలోని సాగర్‌ ఎడమ కాలువ వద్దకు చేరుకున్నారు. అక్కడ లారీని ఆపిన శ్రీకాంత్‌.. క్లీనర్‌తో పాటు ఇతర లారీల డ్రైవర్లతో కలిసి వంట చేసుకొని భోజనం చేశారు. అనంతరం కాళ్లు, చేతులు కడుక్కునేందుకు సాగర్‌ ఎడమ కాలువ వద్దకు వెళ్లిన శ్రీకాంత్‌ ప్రమాదవశాత్తు కాలువలో పడి గల్లంతయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ చలికంటి నరేష్‌ తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు.

హ్యాండ్‌ కట్టర్‌ తగిలి

వలస కార్మికుడు మృతి

చౌటుప్పల్‌ రూరల్‌: చౌటుప్పల్‌ మండలం నేలపట్ల గ్రామ పరిధిలోని పట్టుపురుగుల పరిశ్రమలో ఆదివారం హ్యాండ్‌ కట్టర్‌ తగిలి వలస కార్మికుడు మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లాకు చెందిన ఆకాష్‌కుమార్‌ కర్మ(22) తన భార్య వర్షతో కలిసి ఏడాది క్రితం నేలపట్లలోని యాదాద్రి రిల్లింగ్‌ అండ్‌ ట్విస్టింగ్‌ యూనిట్‌లో పనిచేయడానికి వచ్చాడు. పరిశ్రమలో పట్టుదారం కండెలు కట్టే పనిచేసే ఆకాష్‌కుమార్‌కు ఆదివారం పరిశ్రమ యాజమాని గంజి మహేష్‌ మట్టి పనిపాటు యూనిట్‌లో ఉన్న ఇనుప రాడ్లను హ్యాండ్‌ కట్టర్‌తో కట్‌ చేయమని చెప్పాడు. అయితే తనకు హ్యాండ్‌ కట్టర్‌ ఉపయోగించడం రాదని ఆకాష్‌కుమార్‌ చెప్పినా కూడా యాజమాని పట్టించుకోకుండా రాడ్లు కట్‌ చేయమని చెప్పడంతో.. అతడు రాడ్లు కట్‌ చేస్తుండగా హ్యాండ్‌ కట్టర్‌ జారి ఎడమ కాలు తొడపై పడింది. దీంతో ఆకాష్‌కుమార్‌ తొడ కట్‌ అయ్యి తీవ్ర రక్తస్రావం జరిగింది. 108 వాహనంలో అతడిని చౌటుప్పల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే ఆకాష్‌కుమార్‌ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి భార్య వర్ష ఫిర్యాదు మేరకు పరిశ్రమ యాజమాని గంజి మహేష్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నర్సిరెడ్డి తెలిపారు.

నల్లబెల్లం పట్టివేత
1
1/2

నల్లబెల్లం పట్టివేత

నల్లబెల్లం పట్టివేత
2
2/2

నల్లబెల్లం పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement